షారుక్ ఖాన్ నెక్లెస్ కావాలన్న లేడీ ఫ్యాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-25T18:15:19+05:30 IST

ఎక్కడైనా సినీ నటులకి, ముఖ్యంగా హీరోలకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో తమ అభిమాన హీరో ఎలాంటి స్టైల్‌ని ఫాలో అవుతారో..

షారుక్ ఖాన్ నెక్లెస్ కావాలన్న లేడీ ఫ్యాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఎక్కడైనా సినీ నటులకి, ముఖ్యంగా హీరోలకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో తమ అభిమాన హీరో ఎలాంటి స్టైల్‌ని ఫాలో అవుతారో.. దాన్నే నిజ జీవితంలో ఫ్యాన్స్ అనుకరిస్తుంటారు. వారు వాడిన వస్తువులని కావాలనుకుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిమాని ఆయన ‘కుచ్ కుచ్ హోతా హై’లో ధరించిన నెక్లెస్ కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.


ఆ అభిమాని.. ‘కుచ్ కుచ్ హోతా హై సినిమాలో షారుక్ వేసుకున్న కూల్ నెక్లెస్ చైన్ ఎక్కడ దొరుకుతుందో.. ఎవరైనా కొంచెం చెప్పండి’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై ఎంతోమంది నెటిజన్లు వివిధ రకాలు స్పందించారు. కాగా.. ఆ సినిమాని నిర్మించిన ధర్మ ప్రొడ్రక్షన్స్ ఆ అభిమాని ట్వీట్‌కి.. ‘మీ లోకేషన్‌ని మాకు పంపించండి.. మేము మీకు ఒకటి పంపుతాం’ అంటూ రిప్లై ఇచ్చింది.






అనంతరం ఆ అభిమాని తన లోకేషన్‌ వారికి పంపించగా ఆమెకి అలాంటివే రెండు చైన్స్ అందాయి. దీంతో వాటి పిక్స్ షేర్ చేసి.. ‘ఇది ఎక్కడ మొదలై ఎక్కడికి వెళుతోంది. మీరు చేసిన పని నా నవ్వులకి కారణమైంది. ఒక అమ్మాయి సిల్లీ కోరికని నిజం చేసినందుకు ధర్మ ప్రొడక్షన్స్‌కి ధన్యవాదాలు’ అంటూ ఆ లేడి ఫ్యాన్ రాసుకొచ్చింది.





Updated Date - 2022-03-25T18:15:19+05:30 IST