Laal Singh Chaddha Trailer: లైఫ్‌ అంటే పానీపూరి..

ABN , First Publish Date - 2022-07-25T01:56:46+05:30 IST

‘‘ఆమిర్‌ఖాన్‌ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అనిపించుకున్నారు. ఆయన నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టం. ఆమిర్‌ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనలా మేమూ నటించాలనుకుంటాం. కానీ మాకున్న పరిమితుల వల్ల అలా చేయడం కుదరడం లేదు. ఆయన మీదున్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు.

Laal Singh Chaddha Trailer:  లైఫ్‌ అంటే పానీపూరి..

‘‘ఆమిర్‌ఖాన్‌ (Amir khan)ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అనిపించుకున్నారు. ఆయన నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టం. ఆమిర్‌ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనలా మేమూ నటించాలనుకుంటాం. కానీ మాకున్న పరిమితుల వల్ల అలా చేయడం కుదరడం లేదు. ఆయన మీదున్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించిర చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’. కరీనాకపూర్‌ కథానాయిక. నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. తెలుగు వెర్షన్‌కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. తెలుగు ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ను(Laal Singh Chaddha Trailer) చిరంజీవి(Chiranjeevi)విడుదల చేశారు. అనంతరం చిరంజీవికి ఆమిర్‌ పానీ పూరి తినిపించారు. నాగచైతన్య(Naga chaitanya) ఆమిర్‌ఖాన్‌లో తెలుగులో డైలాగ్‌ చెప్పించారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘నేను తొందరపడి ఈ సినిమా విడుదలకు ఒప్పుకోలేదు. సినిమా చూసి గర్వపడి రిలీజ్‌ చేస్తున్నా’’ అని అన్నారు. 


‘‘అమ్మ చెబుతుండేది.. మనందరి తలరాత ముందే రాసుంటుందని.. 

రాసినట్లూ జరుగుతుంటుందని...

అసలు నాకు తెలియనిది ఏంటంటే.. ఎవరు రాశారు.. ఎంత రాశారో.. అసలు ఎందుకు రాశారో ఇవన్నీ..’’


‘‘మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది.. లైఫ్‌ అంటే పానీపూరి లాంటిదని.. కడుపు నిండినట్లు ఉంటుంది కానీ మనసు మాత్రం నిండదని’ అంటూ ఆమిర్‌ఖాన్‌ అమాయకత్వంగా చెప్పిన డైలాగ్‌లు భావోద్వేగంగా సాగాయి. 




Updated Date - 2022-07-25T01:56:46+05:30 IST