Laal Singh Chaddha: రన్ టైమ్ లాక్..?

ABN , First Publish Date - 2022-08-03T17:42:05+05:30 IST

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Amir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అక్కినేని నాగ చైతన్య (Naga chaitanya)

Laal Singh Chaddha: రన్ టైమ్ లాక్..?

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Amir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అక్కినేని నాగ చైతన్య (Naga chaitanya) ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయట. ఈ ఆగష్టు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఒకేసారి హిందీ, తెలుగు పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 


గతంలో ఆయన తాను హీరోగా నటించిన ‘రుద్రవీణ’, త్రినేత్రుడు’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. మళ్ళీ ఇంతకాలానికి ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. నాగ చైతన్య ఈ సినిమాలో బోడి బాలరాజు పాత్రను పోషించారు. మొదటిసారి హిందీ సినిమాలో నటించడంతో పాటు తెలుగులో భారీ స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మూవీపై అక్కినేని అభిమానులతో పాటుగా కామన్ ఆడియన్స్ కి విపరీతమైన ఆసక్తి నెలకొంది. 


ఇప్పటికే, ఈ సినిమాకి ప్రమోషన్స్‌తో భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే, తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందిందని తెలుస్తోంది. టోటల్ రన్ టైమ్ 2 గంటల 44 నిమిషాల 50 సెకండ్లు అని సమాచారం. ఆమిర్ ఖాన్ కి దంగల్ మూవీ తర్వాత మళ్ళీ ఇంతవరకు సరైన సక్సెస్ దక్కలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ ఈ మూవీ మీదే పెట్టుకున్నారు. చూడాలి..చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఆమిర్ కి, మొదటిసారి హిందీ సీమలో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్యకి ‘లాల్ సింగ్ చడ్డా’ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.

Updated Date - 2022-08-03T17:42:05+05:30 IST