Naga Chaitanya: నేనూ చెన్నై చిన్నోడినే..

ABN , First Publish Date - 2022-08-09T02:08:01+05:30 IST

నేనూ చెన్నై చిన్నోడినే.. పదహారేళ్ళ వరకు ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగించానని అన్నారు టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya). బాలీవుడ్‌ నటుడు ఆమిర్ ఖాన్‌ (Aamir Khan)తో కలిసి నాగ చైతన్య ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha)లో..

Naga Chaitanya: నేనూ చెన్నై చిన్నోడినే..

నేనూ చెన్నై చిన్నోడినే.. పదహారేళ్ళ వరకు ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగించానని అన్నారు టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya). బాలీవుడ్‌ నటుడు ఆమిర్ ఖాన్‌ (Aamir Khan)తో కలిసి నాగ చైతన్య ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha)లో నటించారు. ఇది చై తొలి బాలీవుడ్‌ చిత్రం. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం తాజాగా చెన్నై నగరంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ చిత్రాన్ని తమిళంలో పంపిణీ చేస్తున్న రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ (Red Giant Movies) అధినేత- హీరో ఉదయనిధి (Udhayanidhi Stalin), చిత్ర హీరో ఆమిర్‌ ఖాన్‌, నాగ చైతన్య, దర్శకుడు అద్వైత్‌ చందన్‌, నటి మోనా సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. ఇక్కడే 16 యేళ్ళపాటు చదివానని, సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా ఈవెంట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారని అన్నారు. అలాగే, బాలీవుడ్‌లో మొదటిసారి నటించానని, ఈ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉండగా, ఆమిర్‌ ఖాన్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని, ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ సపోర్టు చేయాలి.. అని కోరారు. ఉదయనిధి మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ చిత్రంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. భారీ స్థాయిలో రిలీజ్‌ చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం.. అని పేర్కొన్నారు. 


హీరో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ... ‘రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ వంటి పెద్ద సంస్థ నా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేయడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆదరించాలి’ అని కోరగా.. దర్శకుడు అద్వైత్‌ చందన్‌ మాట్లాడుతూ.. ‘ఎన్నో ఏళ్ళు కష్టపడి తెరకెక్కించాం. ఆమిర్‌తో జర్నీ సంతోషంగా సాగింది అని తెలిపారు. కాగా.. ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌ రావు, జ్యోతి దేశ్‌పాండే, అజిత్‌ అధీరా కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో విడుదలకానుంది.

Updated Date - 2022-08-09T02:08:01+05:30 IST