పార్లర్‌కు వెళ్లే ప్రతి అమ్మాయి కష్టంలో నన్ను నేను చూసుకుంటా: నివేతా పేతురాజ్

ABN , First Publish Date - 2022-02-19T22:09:55+05:30 IST

పార్లర్‌కు వెళ్లే ప్రతి అమ్మాయి కష్టం నాకు తెలుసు. ఆ కష్టంలో నన్ను నేను చూసుకుంటాను అన్నారు యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్. ‘మెంటల్‌ మదిలో, టిక్‌ టిక్‌ టిక్‌, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలవైకుంఠపురములో’ వంటి

పార్లర్‌కు వెళ్లే ప్రతి అమ్మాయి కష్టంలో నన్ను నేను చూసుకుంటా: నివేతా పేతురాజ్

పార్లర్‌కు వెళ్లే ప్రతి అమ్మాయి కష్టం నాకు తెలుసు. ఆ కష్టంలో నన్ను నేను చూసుకుంటాను అన్నారు యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్. ‘మెంటల్‌ మదిలో, టిక్‌ టిక్‌ టిక్‌, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలవైకుంఠపురములో’ వంటి దాదాపు 25 చిత్రాలలో నటించిన నివేతా.. భారతదేశంలో సుప్రసిద్ధమైన స్కిన్‌ క్లీనిక్‌– ఎట్‌ హోమ్‌ బ్రాండ్‌ స్కిన్సీకి భాగస్వామిగా మారారు. స్కిన్సీ ప్రచారంలో భాగంగా పార్లర్‌కు వెళ్లే ప్రతి అమ్మాయి కష్టాలను ఆమె వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిల కష్టాలలో నన్ను నేను చూసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారీ పార్లర్‌లో వ్యాక్సింగ్‌ చేయించుకోవడం విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ వేదన భరించలేనిది. అందువల్ల వీరు నన్ను ఈ భాగస్వామ్యం కోసం సంప్రదించగానే మేము ఈ ప్రచార ఆలోచన గురించి చర్చించాము. మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా అబ్బాయి, అమ్మాయిల ఆందోళనలకు సంబంధించి నేను గొంతునవుతున్నప్పుడు అదెలా ఉండాలనేది చర్చించాము. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి వినోదాత్మకంగా ఉంది. నా అభిమానుల కోసం ఈ విప్లవాత్మక సేవలను పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరిని సంప్రదించాలనుకుంటున్నాను. ఎట్‌ హోమ్‌ లేజర్‌ హెయిర్‌ రిడక్షన్‌ కోసం ట్రయల్‌ సెషన్‌‌ను కూడా ప్రారంభమైంది’’ అని తెలిపారు.


‘స్కిన్‌ క్లీనిక్‌ ఎట్‌–హోమ్‌’ బ్రాండ్‌ స్కిన్సీ నేడు తమ నూతన ప్రచారాన్ని ప్రారంభించింది. ఇంటి వద్దనే లేజర్‌ ద్వారా జుట్టు తగ్గించుకునే సంస్థ సేవలను గురించి తెలిపేందుకు నివేతా పేతురాజ్‌ పక్కింటి అమ్మాయి అవతారంలో ఈ ప్రచారంలో కనిపించనుంది. ఈ ప్రచారాన్ని పలు సామాజిక మాధ్యమాలపై నివేతా పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా స్కిన్సీ హెడ్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌ సుచితా వాధ్వా మాట్లాడుతూ ‘‘ఈ ప్రచారం ద్వారా గతానికన్నా మిన్నగా స్కిన్సీ పాత్రను వెల్లడిస్తున్నాం. వ్యాక్సింగ్‌, షేవింగ్‌ మరియు పలుమార్లు పార్లర్‌ను సందర్శించడం సమయంతో కూడినది, నొప్పినీ కలిగిస్తుంది. మనం కోరుకునే విధానం కూడా కానిది ఇది. ఇప్పుడు స్కిన్సీ యొక్క డెర్మటాలజిస్ట్‌లు వెన్నంటి ఉండే ఎట్‌ హోమ్‌ లేజర్‌ హెయిర్‌ రిడక్షన్‌‌తో శరీరంపై ఎక్కడైనా సరే అవాంఛిత రోమాలను తొలగించడం వీలవుతుంది. నివేతా పేతురాజ్‌తో భాగస్వామ్యంతో ఆమె దేశవ్యాప్తంగా తమ అభిమానులకు ఈ సేవలను గురించి వెల్లడిస్తారు. ఇప్పుడు మేము ఎట్‌ హోమ్‌ కొరియన్‌ ఆక్వా గ్లో ఫేసియల్‌ టెక్నాలజీతో డెర్మాఫేసియల్‌ మరియు మరెన్నో సేవలను మా స్కిన్‌ క్లీనిక్‌ ఎట్‌ హోమ్‌ కింద పరిచయం చేశాం. త్వరలోనే దీనిని ఆవిష్కరించనున్నాం. ఇంటివద్దనే నాణ్యమైన డెర్మటాలజిస్ట్‌ల సేవలను అందించాలనే మా ప్రయత్నాలకు ఇది ఆరంభం. ప్రస్తుతం మా సేవలను పలు నగరాలలో అందిస్తున్నాం’’ అని తెలిపారు.



Updated Date - 2022-02-19T22:09:55+05:30 IST