Kushboo: నా భర్త సుందర్‌ను ధైర్యంగా నమ్మొచ్చు

ABN , First Publish Date - 2022-09-27T17:53:12+05:30 IST

దర్శకుడైన తన భర్త సుందర్‌ సి (Sundar C)ని నిర్మాతలు ధైర్యంగా నమ్మి చిత్రాలు తీయొచ్చని నటి ఖుష్బూ (Kushboo) అన్నారు. ఆమె నిర్మాతగా..

Kushboo: నా భర్త సుందర్‌ను ధైర్యంగా నమ్మొచ్చు

దర్శకుడైన తన భర్త సుందర్‌ సి (Sundar C)ని నిర్మాతలు ధైర్యంగా నమ్మి చిత్రాలు తీయొచ్చని నటి ఖుష్బూ (Kushboo) అన్నారు. ఆమె నిర్మాతగా అవ్ని సినామాక్స్‌ (ప్రై) లిమిటెడ్‌ (Avni Cinemax), ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ (ACS Arun Kumar)కు చెందిన బెంజ్‌ మీడియా (Benzz Media) ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కాఫీ విత్‌ కాదల్’ (Coffee With Kadhal). తాజాగా ఈ చిత్ర ఆడియోను విడుదల చేశారు. హీరోలు జీవా (Jiiva), జై (Jai), శ్రీకాంత్‌ (Srikanth).. హీరోయిన్లు అమృత అయ్యర్‌ (Amritha Aiyer), మాళవికా శర్మ (Malvika Sharma), రైజా విల్సన్‌ (Raiza Wilson), ఐశ్వర్య దత్తా (Aishwarya Dutta), దివ్యదర్శిని, సంయుక్తా షణ్ముగంతో పాటు రెడిన్‌ కింగ్‌స్లీ, యోగిబాబు (Yogibabu) తదితరులు ఈ చిత్రంలో నటించారు. యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించారు.  


ఈ చిత్ర ట్రైలర్‌, ఆడియో రిలీజ్‌ వేడుకలో ఖుష్బూ మాట్లాడుతూ.. ‘‘సుందర్‌ దర్శకత్వం వహించే చిత్రాలకు ఎలాంటి నష్టం రాదు. నిర్మాతకు పెట్టుబడితో పాటు లాభాలు తెచ్చిపెడుతుంది. అందువల్ల నిర్మాత హాయిగా నిద్రపోవచ్చు. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు. ప్రముఖ విద్యాసంస్థల అధినేత ఏసీ షణ్ముగం మాట్లాడుతూ.. ‘‘త్వరలో తమ యూనివర్సిటీ తరపున సుందర్‌కు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్నాం. ఇది మాకు రెండో సినిమా. మూడో చిత్రం కూడా సుందర్‌ దర్శకత్వంలోనే నిర్మించనున్నాం. మా కాంబినేషన్‌లో తెరకెక్కే మూడో చిత్రాన్ని పెద్ద హీరో, భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కించబోతున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని తెలిపారు. (Coffee With Kadhal Audio Launch)


దర్శకుడు సుందర్‌ సి మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక ఫీల్‌ గుడ్‌ మూవీ. గతంలో వచ్చిన నా చిత్రాలకు భిన్నంగా ఉండే రొమాంటిక్‌, లవ్‌, కామెడీ మూవీ. ఊటీలోనే షూటింగ్‌ పూర్తిచేశాం. అక్టోబరు 7న విడుదల చేస్తున్నాం. మొత్తం ఎనిమిది పాటలున్నాయి. యువన్‌ అద్భుతమైన సంగీతం సమకూర్చారు’’ అని వివరించారు. కాగా, ఈ చిత్రాన్ని హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కి చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ (Red Giant Movies) విడుదల చేస్తోంది. 



Updated Date - 2022-09-27T17:53:12+05:30 IST