Brahmastra: 'కుంకుమల' వీడియో సాంగ్ విడుదల

ABN , First Publish Date - 2022-07-17T19:29:46+05:30 IST

భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా తెలుగులో 'బ్రహ్మాస్త్రం' గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir kapoor) -అలియాభట్ (Alia Bhatt)

Brahmastra: 'కుంకుమల' వీడియో సాంగ్ విడుదల

పెదాల్లో...ఒక చిన్ని ప్రశ్నే ఉంది..


నీకై క్షణాల్లో..పడిపోని మనసే ఇది..


ఆ బ్రహ్మే నిను చేయ్యడానికే.. తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే..


అందాలా నీకంటి కాటుకతో.. రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే


కుంకుమల నువ్వే చేరగా ప్రియా...


ఈ లిరిక్స్ తాజాగా విడుదలైన బ్రహ్మాస్త్ర (Brahmastra)  సినిమాలోవి.  


భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా తెలుగులో 'బ్రహ్మాస్త్రం' గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir kapoor) -అలియాభట్ (Alia Bhatt) జంటగా అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున  కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ప‌లువురు స్టార్లు కనిపించనున్నారు. 


తాజాగా 'బ్రహ్మాస్త్రం' (Brahmasthram) చిత్ర యూనిట్ 'కుంకుమల' (Kumkula) అంటూ సాగే వీడియో పాటను విడుదల చేసారు. ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని  'సిద్ శ్రీరామ్' ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం..కన్నడ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 



Updated Date - 2022-07-17T19:29:46+05:30 IST