ఆ సినిమా విడుదలైతే Aamir Khan కెరీర్ ముగిసిపోతుంది: KRK

ABN , First Publish Date - 2022-07-10T19:38:10+05:30 IST

బాలీవుడ్‌ సినిమాలపై, నటులపై విమర్శలు చేస్తూ గుర్తింపు పొందిన నటుడు కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan)...

ఆ సినిమా విడుదలైతే Aamir Khan కెరీర్ ముగిసిపోతుంది: KRK

బాలీవుడ్‌ సినిమాలపై, నటులపై విమర్శలు చేస్తూ గుర్తింపు పొందిన నటుడు కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan). ‘దేశ్‌ద్రోహి’ సినిమాతో బీ టౌన్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు తర్వాత యూట్యూబ్ ద్వారా మూవీ రివ్యూస్ చెబుతూ పాపులారిటీ సాధించాడు. తనను తాను క్రిటిక్‌గా చెప్పుకునే కేఆర్‌కే.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ (Akshay kumar) వంటి స్టార్లపై విమర్శలు చేస్తుంటాడు. తాజాగా ఆమీర్ ఖాన్ (Aamir Khan) కొత్త సినిమాపై కేఆర్‌కే నెగటివ్ కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశాడు.


అందులో.. ‘నాకు ప్రతిరోజూ Laal Singh Buddha గురించి చాలా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కాబట్టి Aamir Khan సినిమాను విడుదల చేయకూడదని నేను భావిస్తున్నాను. ఇది పెద్ద డిజాస్టర్‌ అవుతుంది. ఈ సినిమా విడుదలైతే ఆమీర్ కెరీర్ ముగిసిపోతుంది’ అని కేఆర్‌కే రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. ఇది లాల్ సింగ్ చద్ధా కాదు.. లాల్ సింగ్ బుద్దా అని కేఆర్‌కే కామెంట్స్ చేశాడు. కేఆర్‌కే చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు కేఆర్‌కేపై విమర్శలు చేస్తూ రిప్లై ఇచ్చారు. ‘నువ్వు తీసిన దేశ్‌ద్రోహీ ఓ చెత్త మూవీ’ అని ఓ నెటిజన్.. ‘ఆమీర్‌ని అంటున్నావా.. ఆయన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్‌ అయ్యాయి. అందుకే.. ఆయన సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.



Updated Date - 2022-07-10T19:38:10+05:30 IST