Hrithik Roshan: కంగనా రనౌత్ ప్రైవేట్ ఫొటోలు చూపించాడంటూ.. బాలీవుడ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఆర్‌కే

ABN , First Publish Date - 2022-08-26T17:40:41+05:30 IST

బాలీవుడ్‌ మీద, అక్కడి స్టార్ హీరోల మీద విమర్శలు చేస్తూ సినీ విశ్లేషకుడిగా పాపులారిటీ నటించిన నటుడు కమాల్ ఆర్ ఖాన్...

Hrithik Roshan: కంగనా రనౌత్ ప్రైవేట్ ఫొటోలు చూపించాడంటూ.. బాలీవుడ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఆర్‌కే

బాలీవుడ్‌ మీద, అక్కడి స్టార్ హీరోల మీద విమర్శలు చేస్తూ సినీ విశ్లేషకుడిగా పాపులారిటీ నటించిన నటుడు కమాల్ ఆర్ ఖాన్(kamaal R Khan). నిజానికి ఆయన్ని ఆయనే సినీ విమర్శకుడిగా చెప్పుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా.. ఫేమస్ నటుల సినిమాల మీద రివ్యూలు ఇస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా సైతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌(Hrithik Roshan)పై ఎప్పటిలాగే సంచలన వ్యాఖ్యలు చేశాడు.


తాజాగా హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘విక్రమ్ వేద’ టీజర్ విడుదలైంది. అది ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ టీజర్ రివ్యూని కేఆర్‌కే తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు. అందులో.. ఆయన మాట్లాడుతూ హృతిక్ రోషన్‌పై విమర్శలు చేశాడు. కేఆర్‌కే మాట్లాడుతూ.. ‘హృతిక్ రోషన్ ఎందుకు ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నాడో తెలియట్లేదు. ఆయన ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలి. కంగనా రనౌత్కి’(Kangana Ranaut) ఆయనకి మధ్య జరిగిన స్టోరీని నాకు చెప్పినట్లుగానే అందరికీ చెప్పాలి. హృతిక్ ఒకసారి తన ల్యాప్‌టాప్‌లో కంగనా రనౌత్ సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను చూపించాడు. అవి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. వాటి గురించి కూడా తర్వాత సరైన సమయంలో మాట్లాడతాను’ అని చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు.. కేఆర్‌కే ప్రెగ్నెన్సీ పిక్స్‌ని షేర్ చేసిన బాలీవుడ్ నటీమణుల గురించి విమర్శలు చేశాడు. అలాగే సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్లపై కూడా ఓ రేంజ్‌లో విమర్శలు చేశాడు.

Updated Date - 2022-08-26T17:40:41+05:30 IST