Krithi Shetty: రిజల్ట్‌పై రిగ్రెట్‌ ఉండదు

ABN , First Publish Date - 2022-08-06T23:42:49+05:30 IST

‘ఉప్పెన’లో బేబమ్మగా మెప్పించారు కృతీశెట్టి. ఆ చిత్రం సక్సెస్‌తో టాలీవుడ్‌కి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నారు. ‘మాచర్ల నియోజక వర్గం’ మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కృతీ.

Krithi Shetty: రిజల్ట్‌పై రిగ్రెట్‌ ఉండదు

‘ఉప్పెన’లో బేబమ్మగా(Bebamma) మెప్పించారు కృతీశెట్టి. ఆ చిత్రం సక్సెస్‌తో టాలీవుడ్‌కి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నారు. ‘మాచర్ల నియోజక వర్గం’ మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కృతీ(Krithi Shetty). నితిన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎమ్మెస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి కృతీశెట్టి విలేకర్లతో మాట్లాడారు. 


కరోనా తర్వాత బిజీగా ఉన్న హీరోయిన్‌ అంటే నా పేరే చెబుతున్నారు. అది నా గొప్పతనం కాదు. నాలోని ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతల గొప్పతనం. అందుకు వారికి రుణపడి ఉంటా. వరుస సినిమాలు చేయడాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. సరిగ్గా లెక్కేసుకుంటే నేను ఇండస్ట్రీలో ఎంటరై రెండేళ్లు కావొస్తుంది. వరుస అవకాశాలు వస్తున్నాయీ అంటే నా కథల ఎంపిక రాంగ్‌ కాదని అనుకుంటున్నా. పని లేకపోతే నాకు పిచ్చెక్కినట్లు అవుతుంది. ఎప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అనిపిస్తుంటుంది. కథ విన్నప్పుడు నేను ఎంతగా ఎంటర్‌టైన్‌ అయితే ప్రేక్షకులు అంతగా సినిమాను ఆస్వాదిస్తారని నమ్ముతారు. రిజల్ట్‌పై నాకు రిగ్రెట్‌ వుండదు. ఏదైనా సరే లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకుంటా. 




ఇందులో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్‌, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అయితే ఈ పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. సన్నివేశాన్ని బట్టి ఒక్కో షేడ్‌ బయటికి వస్తుంది. పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. విన్న వెంటనే ఓకే చెప్పిన స్ర్కిప్ట్‌ ఇది. పొలిటికల్‌ టచ్‌తోపాటు మంచి పాటలు, కామెడీ, యాక్షన్‌ అన్నీ ఉన్నాయి. లాంగ్‌ వీకెండ్‌ లాంటి సినిమా ఇది. ఫ్యామిలీ మొత్తం చక్కగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాతో నితిన్‌ మంచి స్నేహితుడు అయ్యారు. నిజాయతీ ఉన్న వ్యక్తి. ఇరవై ఏళ్ళుగా  ఇండస్ట్రీలో ఉన్న ఆయన్ను నన్ను దీవించమని కోరాను. కోపం, చిరాకు అంటే తెలియని వ్యక్తి దర్శకుడు రాజశేఖర్‌.  సీన్‌ చెప్పడానికి చాలా  ఎగ్జైట్‌ అవుతుంటారు. నాతో మరో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటాను. ఆయనకి గొప్ప విజయాలని దక్కాలని కోరుకుంటాను.


ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నాలో వెర్సటాలిటీ నిరూపించుకోవాలి. ఉప్పెన తర్వాత బ్యాలెన్స్‌గా ప్రాజెక్ట్స్‌ సైన్‌ చేశాను. అయితే వరుసగా కమర్షియల్‌ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంద్రగంటి, సూర్య చిత్రాలలో భిన్నంగా కనిపిస్తా. కొత్తగా వినే కథల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహిస్తున్నా.(Krithi Shetty interview)


ఉప్పెనలో సంప్రదాయంగా కనిపించిడం, బేబమ్మ పాత్ర బలమైనది కావడం నా సక్సెస్‌కు మూల కారణం. ఎంతోమంది ఆ పాత్రను ఇష్టపడ్డారు. అయితే అన్నీ అలాంటి పాత్రలే చేయాలని లేదు కదా.. నటనకు  వెర్సటాలిటీ ముఖ్యం. అందుకే ఉప్పెన తర్వాత వెంటనే శ్యామ్‌ సింగరాయ్‌లో పూర్తిగా భిన్నంగా వుండే పాత్ర చేశాను. వెర్సటాలిటీ విషయంలో విజయ్‌ సేతుపతి నాకు స్ఫూర్తి. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల ఆలోచన లేదు. అది బాధ్యతతో  కూడుకున్న అంశం. దర్శక నిర్మాతలు బలమైన నమ్మకం కలిగించినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి కానీ అటు వైపు వెళ్లే ఆలోచన లేదు. తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఆనందం చాలు. చిన్నప్పటి నుంచీ ఎన్జీవో స్టార్ట్‌ చేయాలని ఉండేది. త్వరలోనే మొదలుపెడతా. (Chit chat with Krithi Shetty)


Updated Date - 2022-08-06T23:42:49+05:30 IST