మరోసారి Naga Chaitanya కు జంటగా క్రేజీ హీరోయిన్..

ABN , First Publish Date - 2022-06-23T17:57:27+05:30 IST

వరుస సూపర్ హిట్స్‌తో దూసుకెళుతున్నాడు అక్కినేని నాగ చైతన్య (Akkineni Nagachaithanya). మ‌జిలీ, వెంకీ మామ‌, ల‌వ్ స్టోరి (Love Stosy), బంగార్రాజు (Bangarraju)

మరోసారి Naga Chaitanya కు జంటగా క్రేజీ హీరోయిన్..

వరుస సూపర్ హిట్స్‌తో దూసుకెళుతున్నాడు అక్కినేని నాగ చైతన్య (Akkineni Nagachaithanya). మ‌జిలీ, వెంకీ మామ‌, ల‌వ్ స్టోరి (Love Stosy), బంగార్రాజు (Bangarraju) లాంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న చైతూ, మరికొన్ని చిత్రాలను కమిటయ్యాడు. ఇటీవలే తన కొత్త సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu), నాగ చైతన్య కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. 'మానాడు' వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత వెంక‌ట్ ప్ర‌భు రూపొందిస్తున్న సినిమా ఇది. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల కానుంది. నేడు ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరోలు రానా దగ్గుబాటి (Rana Daggubati), శివ కార్తికేయన్ (Siva Karthikeyan), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) సంగీత దర్శకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా తదితరులు హాజరయ్యారు.  


నాగ చైతన్య కెరీర్‌లో తెరకెక్కబోతున్న ఈ 22వ చిత్రానికి సంబంధించి మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పటికే, బంగార్రాజు సినిమాలో చైతూకి జోడీగా నటించి అలరించిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krthi Shetti) హీరోయిన్‌గా ఎంపికైంది. 'ఉప్పెన' సినిమాతో భారీ హిట్ అందుకున్న కృతి, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బగార్రాజు సినిమాలతోనూ వరుస హిట్స్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఈ క్రమంలోనే నాగ చైతన్య - వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కుస్తున్న సినిమాకు కృతిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిన మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


అంతేకాదు, ఈ చిత్రానికి ఇసైజ్ఞాని, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) సంగీతం అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటికే మ్యూజిక్ మాస్ట్రో తెలుగులో 'రంగ మార్తాండ' సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళంలో అరడజను చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్య సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికవడం విశేషం. ఇక త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుందని తెలుస్తోంది. కాగా, ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇదే సంస్థలో శ్రీనివాసా చిట్టూరి (Srinivasa Chitturi) రామ్‌తో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి 'ది వారియ‌ర్'‌ (The Warroior). మ‌రో చిత్రం రామ్‌ (Ram)తోనే బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ఇక ఇదే నిర్మాణ సంస్థలో కృతి శెట్టి రెండవ సినిమాకు ఎంపికవడం విశేషం. 







Updated Date - 2022-06-23T17:57:27+05:30 IST