ఇంటర్వ్యూ: కృతీశెట్టి (The Warriorr)

ABN , First Publish Date - 2022-07-05T21:29:52+05:30 IST

మనిద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేసా.. ‘ఉప్పెన’లో బేబమ్మ.. నీ కెరియర్‌ నా ఖర్మ.. శ్యామ్‌సింగరాయ్‌లో కీర్తి.. సమస్యలు ట్విట్టర్‌లో పెడతా... పరిష్కారం ఇన్‌స్టాలో చూపిస్తా.. డెవలప్‌మెంట్‌ ఫేస్‌బుక్‌లో పెడతా ‘బంగార్రాజు’లో నాగలక్ష్మీ. ఇలా విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారారు కృతీశెట్టి. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘వారియర్‌’.

ఇంటర్వ్యూ: కృతీశెట్టి (The Warriorr)

మనిద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేసా.. ‘ఉప్పెన’లో బేబమ్మ..

నీ కెరియర్‌ నా ఖర్మ.. శ్యామ్‌సింగరాయ్‌లో కీర్తి..

సమస్యలు ట్విట్టర్‌లో పెడతా... పరిష్కారం ఇన్‌స్టాలో చూపిస్తా.. డెవలప్‌మెంట్‌ ఫేస్‌బుక్‌లో పెడతా

‘బంగార్రాజు’లో నాగలక్ష్మీ.

ఇలా విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారారు కృతీశెట్టి. 

తాజాగా ఆమె నటించిన చిత్రం ‘వారియర్‌’. (Krithi Shetty  interview About The warrior)

‘మార్నింగ్‌ వార్నింగ్‌ ఇచ్చి.. ఈవెనింగ్‌ అరెస్ట్‌ చేసిన పర్ఫెక్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ని చూశారా ఎప్పుడైనా’’ అంటూ ఆర్జే మహాలక్ష్మీ అలరించడానికి సిద్ధమవుతున్నారీ బ్యూటీ. లింగుస్వామి (Lingu swamy)దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ పోతినేని కథానాయకుడు. తెలుగు. తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కృతీశెట్టి ఈ చిత్రం విశేషాలను ముచ్చటించారు. (Ram potineni)


లింగుస్వామిగారి ‘ఆవారా’ సినిమా కొన్నేళ్ల క్రితం చూశా. ఆ సినిమా నాకొక మంచి జ్ఞాపకం. ఎందుకంటే మా హోమ్‌టౌన్‌ నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్లేటప్పుడు ఆ సీడీ తీసుకొని వెళ్లి రోజుకి మూడు, నాలుగుసార్లు చూసేదానిని. నాకు అంతగా నచ్చిందా సినిమా. లింగుస్వామి ఫోన్‌ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఎందుకంటే... ఆయన సినిమాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. కథ కొత్తగా ఉంటుంది. హీరోయిన్‌లకు పాత్రలకు మంచి స్కోప్‌ ఉంటుంది. ఆయన చెప్పిన కథ విని చాలా ఎగ్జైట్‌ అయ్యా. ఇందులో నా పాత్ర పేరు మహాలక్ష్మీ. ఆర్జేగా పనిచేస్తాను. లవబుల్‌, క్యూట్‌, గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌లాగా ఉంటుంది. మా ఇంటి అమ్మాయి అని ప్రేక్షకులు ఫీలయ్యేలా నా పాత్ర ఉంటుంది. ఇందులో రామ్‌ది పోలీస్‌ పాత్ర. పోలీస్‌ స్టేషన్‌కు, రేడియో స్టేషన్‌కు మధ్య రైల్వే ేస్టషన్‌ ఉంది! బహుశా... అక్కడ ఈ పోలీస్‌, ఆర్జేల్లో ప్రేమ పుట్టి ఉండొచ్చు. ఆర్జే పాత్ర కోసం కాస్త హోంవర్క్‌ చేశా. తెలుగు ఆర్జే వీడియోలు చూశా. వాయిస్‌ వినిపించినప్పుడు ఆర్జే కనిపించకపోయినా.. ఎక్స్‌ప్రెషన్‌ ఫీల్‌ అవ్వాలి. అది గమనించాను. 




సవాల్‌ ఏమీ లేదు...

లింగుస్వామి క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయనకు ఎలా కావాలో స్ట్రెయిట్‌గా చెప్పేస్తారు. అవసరమైతే యాక్ట్‌ చేసి చూపిస్తారు. చిన్న విషయాన్ని కూడా అర్థమయ్యేలా చెప్పడంతో నా పని చాలా ఈజీగా చేసుకెళ్లిపోయా. అంతగా సవాళ్లు ఏమీ ఎదురవ్వలేదు. (Krithi Shetty)


ఎనర్జీ లెవల్‌ పెరిగింది. 

ఇటీవల విడుదలైన రెండు పాటలను చూసి జోడీ బావుంది అంటున్నారు. పూర్తి స్థాయిలో ఎలా ఉంటుంది అనేది సినిమా చూసి ఆడియన్స్‌ చెప్పాలి. సినిమా చూశాక ప్రేక్షకుల రియాక్షన్‌ చూసి నేను విజిల్స్‌ వేస్తా. అది మాత్రం పక్కా. బుల్లెట్‌ సాంగ్‌ చేసేటప్పుడు చాలా నెర్వస్‌ అనిపించింది. ఎందుకంటే రామ్‌ ఎనర్జీని అందుకోవడం కష్టం. ఆ పాట చేయడానికి కాస్త సమయం పట్టింది. బుల్లెట్‌ సాంగ్‌ క్లాసీ లుక్‌లో ఉంటుంది. ‘విజిల్‌’ సాంగ్‌ ఫుల్‌ మాస్‌. నాకు ఎక్స్‌ట్రా ఎనర్జీ కావలసినప్పుడు విజిల్‌ సాంగ్‌ పెట్టుకుని డాన్స్‌ చేస్తాను. నేను ఎప్పుడూ ఎనర్జీగా కనిపించాలనుకుంటా. రామ్‌తో ఈ సినిమా చేశాక నా ఎనర్జీ లెవల్‌ మరింత పెరిగింది. 


అవకాశాలు వదులుకున్నా...

‘బంగార్రాజు’ సెట్‌ మీద ఉండగానే ‘వారియర్‌’, మాచర్ల నియో.క వర్గం’ సినిమాల చిత్రీకరణ జరిగింది. టైమ్‌ అడ్జస్ట్‌ కాక అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది. నిద్ర సరిపోయేది కాదు. ఒకేసారి మూడు పాత్రలు చేస్తున్నప్పుడు కాస్త కన్‌ఫ్యూజ్‌ కావడం సహజం. అందుకే కథ విన్నప్పుడే నా పాత్ర గురించి కొంత నోట్స్‌ రాసుకుంటా. ఏదైన డౌట్‌ వచ్చినప్పుడు ఆ బుక్‌ తసిన చూసుకుంటా. అప్పుడు ఆ పాత్రలోకి వెళ్లిపోతా. మూడు సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో డేట్స్‌ అడ్జస్ట్‌ కాక అవకాశాలు వదులుకోవల్సి వచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా నాకు లేదు. నాకు ఏ కథ నచ్చుతుందో, నేను ఏ పాత్రకు సూట్‌ అవుతానో ఆ సినిమాలే అంగీకరిస్తున్నా, అందుకే చాలామంది సెలెక్టివ్‌గా వెళ్తున్నావ్‌ అంటున్నారు. (Krithi Shetty)



ఒత్తిడి లేకుండా ఎలా...

తొలి సినిమాతోనే స్టార్‌డమ్‌ వచ్చింది కదా.. కథల ఎంపికలో ఒత్తిడి ఏమైనా ఉందా అంటే ఉందనే చెబుతాను. ఆడియన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు అనే ఆలోచన కొంత ఉంటుంది. (Krithi Shetty)ముఖ్యంగా నాకు నేను ఒత్తిడి తెచ్చుకుంటాను. ఎందుకంటే భుజాలపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి కాబట్టి. ఇక కథ వినేటప్పుడు నేను ఎంటర్‌టైన్‌ అయితే ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ అవుతారని భావిస్తా. నా ప్రతి అడుగులోనూ అమ్మ మాట తప్పనిసరి. ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రల్లో ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర ఎప్పటికీ గుండెల్లో ఉండిపోతుంది. 


ఆ ప్రేమ ఊహించలేదు...

‘ఉప్పెన’ సక్సెస్‌ తర్వాత తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు నేను ఊహించలేదు. అంత ప్రేమ చూపిస్తారని. ‘వారియర్‌’తో తమిళ పరిశ్రమలో కూడా అడుగు పెడుతున్నా. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇప్పుడు సూర్య–బాల కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నా. నాగచైతన్య, వెంకట్‌ ప్రభు నటిస్తున్న ఓ సినిమాకూ సైన్‌ చేశా. 


డ్రీమ్‌ రోల్‌..

ఇప్పుడు కాదు... కొన్నేళ్ల తర్వాత యాక్షన్‌ రోల్‌ చేయాలనుంది. ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ స్ర్కిప్ట్స్‌ ఇప్పటి దాకా వినలేదు. ఈ  చిత్రం తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’తో ప్రేక్షకుల ముందుకొస్తా. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదలైన నెలలోపే ‘బంగార్రాజు’ విడుదల కావడంతో ఇప్పుడు రాబోతున్న ‘వారియర్‌’ కాస్త లేట్‌ అయిందేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఏడాదిలో నా నుంచి రెండో సినిమా రావడం హ్యాపీగా ఉంది. (Krithi Shetty)

Updated Date - 2022-07-05T21:29:52+05:30 IST