Krithi Shetty : బాలీవుడ్ నుంచి అవకాశాల ఉప్పెన

ABN , First Publish Date - 2022-08-08T16:08:30+05:30 IST

‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా అడుగుపెట్టింది తుళు బ్యూటీ కృతి శెట్టి (Krithi shetty). తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చి పడింది. ఆ సక్సెస్ క్రెడిట్‌తోనే వరుస అవకాశాలు అమ్మడిని వరించాయి.

Krithi Shetty : బాలీవుడ్ నుంచి అవకాశాల ఉప్పెన

‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా అడుగుపెట్టింది తుళు బ్యూటీ కృతి శెట్టి (Krithi shetty). తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చి పడింది. ఆ సక్సెస్ క్రెడిట్‌తోనే వరుస అవకాశాలు అమ్మడిని వరించాయి. చూపు తిప్పుకోలేని అందం, చూడ ముచ్చటైన అభినయం కృతి శెట్టి ప్రత్యేకత. ఆ కారణంగానే  కృతి వరుసగా ‘శ్యామ్ సింగరాయ్ (Shyam Singharoy), బంగార్రాజు (Bangarraju)’ చిత్రాల్లో కథానాయికగా ఆఫర్స్ అందుకుంది. ఈ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో హ్యాట్రిక్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్‌గా వచ్చిన రామ్ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్’ (The Warrior) చిత్రం నిరాశ పరిచినప్పటికీ.. ఆమె వరుసగా బడా ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీ అయిపోయింది. వాటితో పాటు పారితోషికాన్ని కూడా భారీగా పెంచేసింది.


ప్రస్తుతం కృతి శెట్టికి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా కృతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయని, అయినప్పటికీ తెలుగులో బిజీగా ఉండడంతో అక్కడ సినిమాలు చేయలేకపోతున్నానని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో సూర్య (Surya) సరసన కథానాయికగా ఒక సినిమాలో నటిస్తోంది. నితిన్ (Nithin) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam) లో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 12న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రమోషనల్ ఇంటరాక్షన్‌లో కృతి శెట్టి ఆ విషయాన్ని వెల్లడించింది. 


బాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ, తెలుగులో బిజీ అయిన కారణంగానూ, డేట్స్ సర్దుబాటు అవకపోవడం వల్లనూ తాను బాలీవుడ్ ఆఫర్స్‌ను పక్కన పెట్టాల్సి వస్తోందని అంటోంది కృతి. తమిళంలో సూర్య చిత్రంతో పాటు తెలుగులో మరో మూడు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టు తెలిపింది. ఈ మూడు సినిమాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరి  ఫ్యూచర్‌లో అయినా కృతి శెట్టి  బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి. 

Updated Date - 2022-08-08T16:08:30+05:30 IST