ఆ ఇద్దరితో చేయాలని ఉంది: Krithi Shetty

ABN , First Publish Date - 2022-07-06T16:06:08+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)లతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తుంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty).

ఆ ఇద్దరితో చేయాలని ఉంది: Krithi Shetty

టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)లతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తుంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty). 'ఉప్పెన' సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పుడు అమ్మడు ఊపిరాడనంత బిజీగా సినిమాలు చేసే రేంజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అరడజను సినిమాలను కమిటైంది. అంతేకాదు, బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ అందుకోవడంతో టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. త్వరలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) సరసన నటించిన ద్విభాషా చిత్రం 'ది వారియర్' (The Warrior) రిలీజ్‌కి రెడీ అవుతోంది.


దాంతో కృతి శెట్టి వరుసగా పలు ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తుంది. ఈ సందర్భంగానే తనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబులపై ఉన్న అభిమానాన్ని వెల్లడించింది. చరణ్ సూపర్ క్యూట్‌గా ఉంటారని చెప్పిన కృతి, మహేశ్ చాలా హ్యాండ్సం గా ఉంటారు.. అని తెలిపింది. అంతేకాదు, వీరి సరసన నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ క్యూటీ. 


కృతి పర్ఫారెన్స్ పరంగా ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకుంది. గ్లామర్ రోల్స్ చేయడానికి, అందంలోనూ ..ఏ రకంగా చూసుకున్న తాను చెప్పిన చరణ్, మహేష్‌ల సరసన నటించే అన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అమ్మడి ఆశలు త్వరలోనే నెరవేడం ఖాయమని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి కృతి కోరిక ముందు ఎవరు తీరుస్తారో. కాగా, ఇప్పుడు తన చేతిలో సూర్య - బాలా దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న సినిమా, సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా, నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజిక వర్గం ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.  

Updated Date - 2022-07-06T16:06:08+05:30 IST