SILK పేరుతో రంగంలోకి కృష్ణవంశీ

ABN , First Publish Date - 2022-07-12T18:20:14+05:30 IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshy).. వరుస చిత్రాలతోనూ, వెబ్ సిరీస్‌తోనూ ప్రేక్షకుల్ని వరుసగా ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda) విడుదలకు సిద్ధమవుతోంది.

SILK పేరుతో రంగంలోకి కృష్ణవంశీ

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshy).. వరుస చిత్రాలతోనూ, వెబ్ సిరీస్‌తోనూ ప్రేక్షకుల్ని వరుసగా ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda) విడుదలకు సిద్ధమవుతోంది. ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సోషల్ డ్రామాలో రమ్యకృష్ణ (Ramyakrishna), అనసూయ (Anasuya), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipliganj), బ్రహ్మానందం (Brahmanandam), శివాత్మికా రాజశేఖర్ (Shivatmika Rajasekhar) ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 


‘నటసమ్రాట్’ (Natasamrat) సూపర్ హిట్ మరాఠీ చిత్రానికి ‘రంగమార్తాండ’ చిత్రం అఫీషియల్ రీమేక్. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ లోగోను రివీల్ చేసిన వంశీ.. ఆగస్ట్‌లో విడుదలకు మంచి రిలీజ్ డేట్ చూస్తున్నారు. ఇక దీని తర్వాత కృష్ణవంశీ ‘అన్నం’ (Annam) అనే మరో సోషల్ డ్రామాతో ఓ సినిమా చేయబోతున్నారు. ‘రంగమార్తాండ’ చిత్రం విడుదలయ్యాకా ఆ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలు కానుంది. 


ఇక కృష్ణవంశీ ఈ రెండు సినిమాల తర్వాత ఓ వెబ్ సిరీస్ ను భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. తెలంగాణ సాయుధపోరాటంపై వెబ్ సిరీస్ ఉండబోతోందట. ఇదిలా ఉంటే.. వంశీ వీటితో పాటు.. మరో సరికొత్త రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. SILK పేరుతో ఓ ఆడియో కంపెనీని ప్రారంభించారు. అందులో S  అంటే సీతారామశాస్త్రి, IL అంటే ఇళయరాజా, K అంటే కృష్ణవంశీ అని సమాచారం. సీతారామ శాస్త్రి అంటే కృష్ణవంశీకి ప్రాణం. ఆయనకు ఓ విధంగా వంశీ దత్తపుత్రుడు లాంటి వాడు. అలాగే ఆయన ఇళయరాజాకు వీరాభిమాని. ఆ అభిమానంతోనే ‘అంతఃపురం’ చిత్రానికి ఆయన్ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. తాజా చిత్రం ‘రంగమార్తాండ’ కు సైతం ఆయనే సంగీత దర్శకుడు.  ‘రంగమార్తాండ’ చిత్రం పాటలు ఈ కంపెనీ ద్వారానే విడుదల కాబోతున్నాయి. మొత్తానికి కృష్ణవంశీ తనకిష్టమైన వారిద్దరి పేరుతోనూ SILK ను మొదలు పెట్టడం విశేషం.  

Updated Date - 2022-07-12T18:20:14+05:30 IST