Prabhas మామగారిగా కృష్ణంరాజు?

ABN , First Publish Date - 2022-06-06T15:25:31+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం ‘ఆదిపురుష్ (Aadipurush), సలార్ (salaar), ప్రాజెక్ట్ కె (Project k) ’ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో ఏక కాలంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit), మారుతి (Maruthi) దర్శకత్వంలోని చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. వీటిలో ‘ఆదిపురుష్’ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోంది.

Prabhas మామగారిగా కృష్ణంరాజు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం  ‘ఆదిపురుష్ (Aadipurush), సలార్ (salaar), ప్రాజెక్ట్ కె (Project k) ’ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో ఏక కాలంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit), మారుతి (Maruthi) దర్శకత్వంలోని చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. వీటిలో ‘ఆదిపురుష్’ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోంది. ‘సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా తెరకెక్కుతోన్న  ‘ఆదిపురుష్’ చిత్రానికి సంబంధిచిన ఒక అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో జనక మహారాజుగా రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnamraju) నటిస్తున్నారట. అంటే శ్రీరాముడిగా నటిస్తున్న ప్రభాస్ కు ఆయన మామగారిగా నటిస్తున్నారన్నమాట. 


మిథిలా నగరానికి మహారాజైన జనకుడు.. నాగలితో భూమిని దున్నుతుండగా.. నాగలి కర్రుకు లోపలున్న ఒక పెట్టె తగులుతుంది. అందులో ముద్దులొలుకుతున్న ఒక ఆడపిల్ల కనిపిస్తుంది. పిల్లలు లేని జనకుడు ఆ బిడ్డకు సీతాదేవి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. భూదేవి పుత్రిక అయిన ఆమె.. స్వయంవరంలో శివధనస్సును విరిచిన శ్రీరాముడ్ని వరించడం తెలిసిందే. సీతాదేవిగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Krithi sanan), లక్ష్మణుడిగా సన్నీసింగ్ (Sunny Singh), రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ (Saif Alikhan) నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ (Om rauth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులోని రాముని పాత్రకోసం , దాని మేకోవర్ కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. ఆజానబాహుడైన శ్రీరాముడి పాత్రకు ఆరడుగుల ఎత్తున్న ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని వేరే చెప్పాలా? ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. 


‘రాధేశ్యామ్’ (Radhe shyam) చిత్రంలో ప్రభాస్ కు హస్తసాముద్రికంలో గురువైన పరమహంసగా కృష్ణంరాజు నటించిన సంగతి తెలిసిందే. ఆయన కనిపించింది తక్కువే అయినా.. ప్రభాస్ పాత్రను ఇంట్రడ్యూస్ చేయడానికి, ఆపాత్రను ఎలివేట్ చేయడానికి ఆ పాత్రను బాగా వాడుకున్నాడు దర్శకుడు. ఇక ‘ఆదిపురుష్’ చిత్రంలో కృష్ణంరాజు పాత్ర కూడా తక్కువ సన్నివేశాల్లో కనిపిస్తుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదుకానీ.. ప్రభాస్ సినిమాలో మళ్ళీ కృష్ణంరాజు కనిపించనుండడం విశేషమని చెప్పాలి. ఇంతకు ముందు ప్రభాస్ నటించిన బిల్లా (Billa), రెబల్ (Rebel) చిత్రాల్లో కృష్ణంరాజు నటించిన సంగతి తెలిసిందే. మరి జనకుడిగా కృష్ణంరాజు ఏ స్థాయిలో నటించి మెప్పిస్తారో చూడాలి. 

Updated Date - 2022-06-06T15:25:31+05:30 IST