ఏమవుతుందో మనలో...

ABN , First Publish Date - 2022-08-20T05:30:00+05:30 IST

సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఏమవుతుందో మనలో...

సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వి.వి.గోపాల కృష్ణ దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘ఏమవుతుందో మనలో’ అనే గీతాన్ని శుక్రవారం హరీశ్‌ శంకర్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటని, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ‘‘ప్రేమలోని గాఢతను వ్యక్తం చేసే పాట ఇది. ప్రేమికుల భావాలకు అద్దం పడుతుంది. కాలభైరవ మంచి ట్యూన్లు అందించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామ’’ని నిర్మాత తెలిపారు. 

Updated Date - 2022-08-20T05:30:00+05:30 IST