Krishnam raju condolence meet : వహ్వా.. బాహుబలి భోజనం.. ఐటమ్స్ ఇవే!

ABN , First Publish Date - 2022-09-30T01:02:07+05:30 IST

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కృష్ణంరాజు ఈ నెల 11న స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ప్రభాస్‌ కుంగిపోయారు. కృష్ణంరాజు సంస్మరణ సభ స్వగ్రామమైన మొగల్తూరులో గురువారం నిర్వహించారు.

Krishnam raju condolence meet : వహ్వా.. బాహుబలి భోజనం.. ఐటమ్స్ ఇవే!

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కృష్ణంరాజు (Krishnam raju) ఈ నెల 11న స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ప్రభాస్‌ కుంగిపోయారు. కృష్ణంరాజు సంస్మరణ సభ స్వగ్రామమైన మొగల్తూరులో (Krishnam raju condolence meet at mogalthuru ) గురువారం నిర్వహించారు. దీని కోసం వారం రోజుల ముందే లక్ష మందికి పైగా ఆహ్వానం పంపారు. మొగల్లూరు చుట్టుపక్కల వారందరినీ పేరుపేరున పిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు లక్షమందికి పైగా అభిమానులు పాల్గొంటారని అంచనాతో భారీగా భోజన ఏర్పాట్లు చేశారు. అతిథులకు, సెలబ్రిటీలకు కృష్ణంరాజు ఇంటి పక్కనే ఉన్న స్థలంలో ఏర్పాటు చేయగా, అభిమానులకు, ఇతరులకు ఆ పక్కనే ఉన్న 10 ఎకరాల మామిడి తోటలో భోజనాల ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు మంచి భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే! ఆయన ఇంట్లో భోజనం అంటే విస్తరి మొత్తం ఖాళీ లేకుండా వంటకాలతో నిండిపోవాల్సిందే. ఆయన లేకపోయినా కుటుంబ సభ్యులు ఆయన తరహాలోనే ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజుకు ఇష్టమైన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను ద్రాక్షారామం, కాకినాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన వంటవారు, క్షత్రియ ఫుడ్స్‌ నిర్వాహకులు తయారు చేశారు. 


12 ఏళ్ల తర్వాత...

కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం కోసం ప్రభాస్‌ మొగల్తూరు వెళ్లారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత... ఆయన తన సొంత ఊరికి వచ్చినట్లు మొగల్తూరు వాసులు చెబుతున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా జనాలు మొగల్తూరు చేరుకున్నారు. మొగల్తూరు ఆ చుట్టు పక్కల గ్రామాలు కృష్ణంరాజు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్టేజ్‌ మీద నుంచి ప్రభాస్‌, కుటుంబ సభ్యులు అభిమానులకు అభివాదం చేశారు. ‘అందరూ భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్‌’ అంటూ ప్రభాస్‌ (Prabhas)అభిమానులను కోరారు. అదే వేదికపై శ్యామలా దేవి కూడా మాట్లాడారు. 




ఈ వంటల కోసం వాడిన పదార్థాల లిస్ట్‌ను మొగల్తూరు రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్‌ నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. 

వంటకాలు కేజీల్లో..

6 టన్నుల మటన్‌ కర్రీ , 

6 టన్నుల బిర్యానీ మటన్‌, 

1 టన్ను రొయ్యలు గోంగూర ఇగురు, 

1 టన్ను రొయ్యల ఇగురు,

1 టన్ను స్టఫ్డ్‌ క్రాబ్‌, 

1 టన్ను బొమ్మిడాయల పులుసు

6 టన్నుల చికెన్‌ కర్రీ, 

4 టన్నుల చికెన్‌ ఫ్రై, 

6 టన్నుల చికెన్‌ బిర్యానీ, 

1 టన్నుల పండుగప్ప కర్రీ, 

4 టన్నుల చందువా ఫిష్‌ ఫ్రై, 

2 టన్నుల చిట్టి చేపల పులుసు. 

2 లక్షల బూరెలు. 



బాహుబలి భోజనం...

గోదావరి జిల్లా వంటకాలతో భోజనం పెట్టడంలో కృష్ణంరాజుది ప్రత్యేక శైలి. ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, రాజకీయాల్లోనూ ఆయన ఇంటి వంటకం అంటే ఇష్టపడనివారుండరు. ఇప్పుడు కూడా అలాంటి ఏర్పాట్లే చేశారు. విందు ఏర్పాట్లు చూసినవారంతా ఇది ‘ వహ్వా బాహుబలి భోజనం’ అంటూ నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. 


రాజుగారి ఇంట ఘుమఘుమలాడే మెను ఇదే: 

1. చక్కెర పొంగలి

2. రాజుగారి బూరి 

3. రొయ్యల రాజుల పలావ్‌ 

4. నాన్‌ వెజ్‌ మిక్స్‌డ్‌ బిర్యానీ (రొయ్య, చేప, చికెన్‌)

5. చికెన్‌ ధమ్‌ బిర్యానీ

6. దూపుడు పోతు బిర్యానీ

7. సొర పిడుపు రైస్‌

8. మటన్‌ కర్రీ

9. సొర చేప పొట్టు

10. చందువా ఫ్రై

11. మెత్తళ్లు ఫ్రై

12. పీతల వేపుడు, పులుసు

13. ఎండి రొయ్యలు గోంగూరు

14. ఎండి పండు చేప వంకాయ

15. రామలు చింతకాయ

16. పండు చేప ఇగురు

17. పచ్చి రొయ్యలు గొంగూర

18. గోదావరి వెజ్‌ పలావ్‌

19 బొచ్చె చేప ప్రై

20. ధమ్‌ కా చికెన్‌

21. మటన్‌ బోటీ

22. బొమ్మిడాయల పులుసు

వీటితోపాటు పలు రకాల స్వీట్లు హాట్‌లతో మొత్తం 50 రకాల ఐటెమ్స్‌ వడ్డించారు. 







Updated Date - 2022-09-30T01:02:07+05:30 IST