రాధేశ్యామ్‌: కృష్ణంరాజు పాత్ర ఇదే!

ABN , First Publish Date - 2021-12-20T23:53:49+05:30 IST

ప్రభాస్‌ హీరోగా నటించిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘రాఽధేశ్యామ్‌’లో ఆయన పెదనాన్న రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో ఆయన పోషిస్తున్న పరమహంస పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

రాధేశ్యామ్‌: కృష్ణంరాజు పాత్ర ఇదే!


ప్రభాస్‌ హీరోగా నటించిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘రాఽధేశ్యామ్‌’లో ఆయన పెదనాన్న రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో ఆయన పోషిస్తున్న పరమహంస పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఇందులో ప్రభాస్‌ పామ్‌ రీడర్‌గా విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 




Updated Date - 2021-12-20T23:53:49+05:30 IST