‘కృష్ణ వ్రింద విహారి’.. విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2022-04-24T01:01:39+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై.. నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగల్ ప్రేక్షకుల

‘కృష్ణ వ్రింద విహారి’.. విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై.. నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగల్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపిస్తున్నారు.  


మరో వైపు సినిమా ప్రమోషన్స్ కూడా చిత్రయూనిట్ జోరుగా కొనసాగిస్తుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఈ చిత్రంలో మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాటలో నాగశౌర్య, షిర్లీ సెటియా కెమిస్ట్రీ అదిరింది అనేలా కామెంట్స్ కూడా వినిపించాయి. మహతి స్వరసాగర్‌ స్వర పరిచిన ఈ పాట వీక్షకులని అలరించడమే కాకుండా.. సినిమా కోసం వెయిట్ చేసేలా చేయడంలో సక్సెస్ సాధించింది. కాగా, సీనియర్ హీరోయిన్ రాధిక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.



Updated Date - 2022-04-24T01:01:39+05:30 IST