‘Rangamarthanda’: ఆ టైటిల్ లోగోనే ఫిక్స్ చేశారు

ABN , First Publish Date - 2022-07-09T01:57:42+05:30 IST

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi).. చాలా గ్యాప్ తర్వాత ‘రంగమార్తాండ’ (Rangamarthanda) అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్

‘Rangamarthanda’: ఆ టైటిల్ లోగోనే ఫిక్స్ చేశారు

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi).. చాలా గ్యాప్ తర్వాత ‘రంగమార్తాండ’ (Rangamarthanda) అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా.. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అంతకు ముందు ఈ టైటిల్ లోగోకి సంబంధించి కొన్ని డిజైన్స్‌ను కృష్ణవంశీ.. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. అందులో ఏది బాగుంటుందో తెలపాలంటూ ప్రేక్షకులను కోరారు. ప్రేక్షకులలో ఎక్కువ శాతం సెలక్ట్ చేసిన లోగోనే ఫైనల్‌గా ఈ చిత్ర టైటిల్ లోగోగా కృష్ణవంశీ ప్రకటించారు.


టైటిల్ లోగోకి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకి సహకరిస్తున్న వారందరి పేర్లను ముందు రివీల్ చేసి.. ఆ తర్వాత ‘మన అమ్మానాన్నల కథ’ అంటూ ‘రంగమార్తాండ’ ఫైనల్ టైటిల్ లోగోని ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ఈ టైటిల్ లోగో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను..’’ అంటూ కృష్ణవంశీ తాజాగా ట్వీట్ చేశారు. కాగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లను త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Updated Date - 2022-07-09T01:57:42+05:30 IST