Krishna vamsi: అదీ క్రియేటివిటీ అంటే!

ABN , First Publish Date - 2022-07-10T20:56:41+05:30 IST

క్రియేటివిటీ అంటే ఏంటో క్లియర్‌గా చెప్పుకొచ్చారు దర్శకుడు కృష్ణవంశీ. ఆయన్ను క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనడం కంటే రిక్రియేట్‌ డైరెక్టర్‌ అనడం కరెక్ట్‌ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలాకాలంగా ఆయన మార్క్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆ మార్క్‌ చూపించేందుకు సిద్ధమయ్యారు.

Krishna vamsi: అదీ క్రియేటివిటీ అంటే!

క్రియేటివిటీ అంటే ఏంటో క్లియర్‌గా చెప్పుకొచ్చారు దర్శకుడు కృష్ణవంశీ (krishna vamsi). ఆయన్ను క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనడం కంటే రిక్రియేట్‌ డైరెక్టర్‌ అనడం కరెక్ట్‌ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రంగమార్తాండ' (Ranga marthanda) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలాకాలంగా ఆయన మార్క్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆ మార్క్‌ చూపించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రియేటివికీ పలు ఉదాహరణలతో సరైన నిర్వచనం ఇచ్చారు. (Creative Director krishna vamsi)


‘‘నా పేరు ముందు క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనే బ్రాండ్‌ పెట్టారు. కానీ నేను క్రియేట్‌ డైరెక్టర్‌ని కాదు.  కరెక్ట్‌గా చెప్పాలంటే నన్ను రిక్రియేట్‌ డైరెక్టర్‌ అనొచ్చు. ఇదే మొదటి నుండీ చెబుతున్న. కె విశ్వనాద్‌, బాపు, దాసరి, కోడి రామకృష్ణ, వంశీ, బాలచందర్‌, రాఘవేంద్రరావు ఇలా చాలామంది మనకున్న అద్భుతమైన క్రియేటర్లు. ‘ముత్యాల ముగ్గు, శంకరాభరణం సినిమాలు చూేస్త ఒళ్ళు జలదరిస్తుంది. కంటెంట్‌ గురించి కాదు క్రాఫ్ట్‌ని చూేస్త ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ రోజుల్లో అలా ఎలా అలోచించారు? ఎలా విజువలైజ్‌ చేశారనేది సర్‌ప్రైజింగా ఉంటుంది.  ఎన్టీఆర్‌ వేటగాడు, అడవిరాముడు, ఏఎన్‌ఆర్‌  ప్రేమాభిషేకం చిత్రాలతో ఎలాగైనా ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్న సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు, ఒక వేశ్య.. వారి మధ్య  ఒక ప్లెటోనిక్‌ ప్రేమకథ తో వచ్చిన చిత్రం ‘శంకరభరణం’.  అసలు ఆ టైటిలే చాలా మందికి అర్థం కాదు. అదో రాగం పేరని చెబితే కూడా.. రాగం అంటే ఏమిటని మరో ప్రశ్న ఎదురయ్యే పరిస్థితి. సినిమా విడుదలై హిట్‌ అవడం వేరే సంగతి.  అసలు ఇలాంటి ఐడియాను పుట్టింటి, సినిమా కథగా మార్చి, దానిని దృశ్యకావ్యంగా ఎలా తీశారనేది మిరకిల్‌ అనిపిస్తుంది. బాపు గారి ‘ముత్యాలముగు’్గ కూడా గొప్ప క్రియేషన్‌. అంతా కొత్తవాళ్ళని తీసుకొని మేకప్స్‌ లేకుండా మనందరికీ తెలిసిన కథ రామాయణాన్ని సోషలైజ్‌ చేసి గ్రేట్‌ మ్యాజిక్‌ చేశారు. అదీ క్రియేషన్‌, క్రియేటివిటీ అంటే! 




దర్శకుడికి వంద శాతం క్రియేటివిటీ వుండాలి. దర్శకత్వం అనేది ఫిజికల్‌ జాబ్‌. సినిమాలో క్రియేటివ్‌ జాబ్‌ అనేది స్ర్కీన్‌ప్లేలో ఉంటుంది. ఒక కథని స్ర్కీన్‌ పై ఇలా చెప్పొచ్చనే చోట మాత్రం వంద శాతం క్రియేటివిటీ కావాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి దర్శకుడికి క్రియేటివిటీ కావాలి. ఒక పాత్ర ఎందుకు మాట్లాడుతుందని తెలుసుకోవడానికి క్రియేటివి కావాలి. తెరపై నటులు, తెర వెనుక కెమరా, ఎడిటింగ్‌, మ్యూజిక్‌, లిరిల్స్‌, డైలాగ్‌ రైటర్‌ వీళ్ళందరి ప్రతిభను మ్యానేజ్‌ చేయాలంటే క్రియేటివిటీ లేకపోతే కుదరదు.  స్ర్కీన్‌ప్లే రైటర్‌ కేవలం డైరెక్టర్‌ని మ్యానేజ్‌ చేేస్త చాలు. కానీ క్రియేటివ్‌ స్కిల్స్‌ వున్న అందరినీ మ్యానేజ్‌ చేేస స్కిల్‌ దర్శకుడి దగ్గర వుండాలి. అప్పుడే స్ర్కీన్‌ మీదకి అనుకున్నది అనుకున్నట్లు వస్తుంది’’ అని కృష్ణవంశీ వివరించారు. 

 

Updated Date - 2022-07-10T20:56:41+05:30 IST