ఆయన ఆర్టిస్టుని పువ్వులా చూసుకుంటారు: కోట (పార్ట్ 63)

ABN , First Publish Date - 2022-01-29T03:48:10+05:30 IST

సరేనని సమస్కారం పెట్టుకు వద్దామని వెళ్ళా. ఆయనేదో ఫంక్షన్‌కి వెళ్తున్నట్టున్నారు. ఆయనతో పాటు సినిమా జనాలు లేరు. అంతా డాక్టర్లు, ఇంజినీర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు... ఆయనున్న భోగీలో చాలామంది ఉన్నారు. నేను వెళ్ళి ‘నమస్కారం డైరెక్టర్‌గారూ’ అన్నా. మిగిలినవాళ్ళు కూడా..

ఆయన ఆర్టిస్టుని పువ్వులా చూసుకుంటారు: కోట (పార్ట్ 63)

కొంతమంది చిత్రాల్లో ఎక్కువ పనిచేసి ఉండకపోవచ్చు. అయినా వాళ్ళమీద ప్రేమ, గౌరవం ఉంటాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారి విషయంలో నేను అదేవిధంగా భావిస్తా. ఆయనతో కలిసి నేను గొప్ప గొప్ప సినిమాలేవీ చేయలేదు. అయినా ఆయనంటే నాకు చాలా మర్యాద. ఒకసారి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నా. ఆవేళ అదే ట్రైన్‌లో రాఘవేంద్రరావుగారు ఉన్నారని తెలిసింది. సరేనని సమస్కారం పెట్టుకు వద్దామని వెళ్ళా. ఆయనేదో ఫంక్షన్‌కి వెళ్తున్నట్టున్నారు. ఆయనతో పాటు సినిమా జనాలు లేరు. అంతా డాక్టర్లు, ఇంజినీర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు... ఆయనున్న భోగీలో చాలామంది ఉన్నారు. నేను వెళ్ళి ‘నమస్కారం డైరెక్టర్‌గారూ’ అన్నా. మిగిలినవాళ్ళు కూడా నన్ను చూడగానే గుర్తుపట్టారు. ‘రావయ్యా లోపలికి రా కూర్చో’ అన్నారు రాఘవేంద్రరావుగారు. అందరూ నాతో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే వారి ముఖాల్లో ఏదో సినిమా ఆర్టిస్టు కనిపించాడన్నట్టు లేదు. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. మాటల్లో సినిమాల గురించి చాలా విశేషాలు చెప్పుకున్నాం.


‘సరేనండీ.. ఇక నా సీటుకు వెళ్తాను’ అన్నాను దర్శకేంద్రుడితో. ‘కోటయ్యా, భలేవాడివయ్యా కాసేపు కూర్చో, నీకు మాస్‌ జనాలే కాదయ్యా చదువుకున్నవాళ్ళలోనూ మంచి ఫ్యాన్స్‌ ఉన్నారు’ అన్నారు. చుట్టూ ఉన్నవారు కూడా అవునన్నట్టు తలలూపారు. ఆ వేళ నాకు చాలా ఆనందంగా అనిపించింది. రాఘవేంద్రరావుగారి గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలండీ.. ఆయన ఆర్టిస్టుని పువ్వులా చూసుకుంటారు. ఆయన ఎవరితోనైనా పనిచేస్తున్నారంటే వారి గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. అవతలివారి అవకతవకల్ని పట్టించుకోరు. మంచి గురించే ఆలోచిస్తారు. వాళ్ళ అవసరాలు అనుక్షణం కనిపెట్టి మరీ తీర్చేలా చర్యలు తీసుకుంటారు. రాఘవేంద్రరావుగారి సెట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ అందుకే ఆనందంగా ఫీలవుతారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2022-01-29T03:48:10+05:30 IST