అల్లు అర్జున్‌లో ఇంత శక్తి ఉందా..? అని అనుమానం వస్తుంటుంది: కోట (పార్ట్ 49)

ABN , First Publish Date - 2021-11-13T02:53:55+05:30 IST

పెద్దల కోసం...బన్ని ఏం చేసినా నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన..’ అనే మాటను సాధన చేశాడేమో అనిపిస్తుంది. ప్రతి సినిమాకూ ఎదుగుతున్నాడు. యువతలో తనకంటూ ఓ ప్రత్యేకత, పాపులారిటీ

అల్లు అర్జున్‌లో ఇంత శక్తి ఉందా..? అని అనుమానం వస్తుంటుంది: కోట (పార్ట్ 49)

రెండో హీరో బన్ని. పెద్దల కోసం...బన్ని ఏం చేసినా నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన..’ అనే మాటను సాధన చేశాడేమో అనిపిస్తుంది. ప్రతి సినిమాకూ ఎదుగుతున్నాడు. యువతలో తనకంటూ ఓ ప్రత్యేకత, పాపులారిటీ సంపాదించుకుని కొనసాగుతున్నాడు. కొన్నిసార్లు అతను నటిస్తుంటే ‘అతనిలో అంత శక్తి ఉందా’ అని అనుమానం వస్తుంటుంది. వర్క్‌ విషయంలో చాలా కమిటెడ్‌గా ఉంటాడు. చేసే ప్రతిదాన్నీ చాలా జాగ్రత్తగా చేస్తాడు. 


‘నేను ఫలానా అల్లు రామలింగయ్యగారి మనవడిని, అల్లు అరవింద్‌గారి అబ్బాయిని, చిరంజీవిగారి మేనల్లుడిని... నేను చేసే పనుల వల్ల వారికి చెడ్డపేరు రాకూడదు. నేనేం చేసినా మా వాళ్లందరికీ మంచి పేరు తీసుకురావాలి. అందుకోసం అహర్నిశలు కష్టపడటానికైనా సిద్ధంగా ఉండాలి’ అనే ఆలోచన ఉన్న వ్యక్తి బన్ని. అతని డ్యాన్సులకు చిన్నపిల్లల నుంచి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. డైలాగులు నేటితరానికి కనెక్ట్‌ అయ్యేలాగా చెప్పడంలో సిద్ధహస్తుడు. అందుకే బన్ని ఈ జనరేషన బోయ్‌. 


ఒకసారి వాళ్ల తాతగారు అల్లురామలింగయ్యగారి అవార్డు నాకు ఇస్తూ ఆ వేదిక మీద ‘‘ఇన్నాళ్ళకి మా తాతగారి పేరు మీద ఇస్తున్న ఈ అవార్డుకు గౌరవం వచ్చింది. శ్రీనివాసరావుగారికి ఇవ్వడం వల్ల’’ అన్నాడు. అతని మనసులో నా పట్ల ఉన్న గౌరవానికి చాలా ముచ్చటనిపించింది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-11-13T02:53:55+05:30 IST