నన్ను నేను ఓ మహిళగా భావించట్లేదు: బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-03-25T19:27:47+05:30 IST

‘పేజ్ 3’, ‘ఓంకార’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన నటి కొంకణా సేన్ శర్మ. ఈ బ్యూటీ ఏ విషయం మీదైన ముక్కుసూటిగా..

నన్ను నేను ఓ మహిళగా భావించట్లేదు: బాలీవుడ్ బ్యూటీ

‘పేజ్ 3’, ‘ఓంకార’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన నటి కొంకణా సేన్ శర్మ. ఈ బ్యూటీ ఏ విషయం మీదైన ముక్కుసూటిగా మాట్లాడుతుంటుంది. ముఖ్యంగా.. లింగ సమానత్వం మీద ఎక్కువగా తన అభిప్రాయాలను వెళ్లిబుచ్చుతూ ఉంటుంది. తాజాగా సైతం జెండర్ ఇక్వాలిటీ మీద ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


కొంకణా ఫెమినిజం గురించి మాట్లాడుతూ.. ‘నేను ఏదైనా సినిమాలో స్త్రీవాది పాత్రలో నటించాల్సి వచ్చినా సరే.. దాని గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ అయినా, పురుషుడైనా, మరేవరైనప్పటికీ.. ఖచ్చితంగా మధ్యరకంగానే ఆలోచించాలని నేను భావిస్తాను. అప్పుడే అందరికీ సమన్యాయం చేయగలగుతామని నా అభిప్రాయం. అందుకే ఎప్పుడూ నన్ను నేను ఓ మహిళగా భావించుకోను’ అంటూ చెప్పుకొచ్చింది.


కొంకణాకి 2010లోనే నటుడు రణ్‌వీర్ షోరే‌తో వివాహమైంది. అనంతరం అయిదు సంవత్సరాల తర్వాత అంటే 2015 నుంచి వ్యక్తిగత కారణాలతో విడిగా ఉన్నారు. 2020లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. మాజీ భర్త గురించి కొంకణా మాట్లాడుతూ.. ‘సమాజంలో ఉన్నప్పుడు కొన్నింటి  గురించి నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కానీ ఆయన సంబంధించిన తాను ఎలాగైనా అనుకోవచ్చు అని భావిస్తాడు’ అని తెలిపింది.


అంతేకాకుండా.. ‘జనాల కోసం అన్నింటిని భరిస్తూ ఉండడం నావల్ల కాదు. నాకంటూ ప్రత్యేకంగా ఓ గది, ఓ బాత్రూమ్, ఏసీ వంటివి మరికొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఉండాలి. కొన్నిసార్లు ఎవరి అనుమతి లేకుండా నాకు నచ్చిన పనులు చేసేలా ఉండాలి’ అని కొంకణా చెప్పింది.

Updated Date - 2022-03-25T19:27:47+05:30 IST