Hello World అంటోన్న మెగాడాటర్ !

ABN , First Publish Date - 2022-07-12T17:11:27+05:30 IST

‘ఒకమనసు’ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌లో నిహారిక ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే . ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో పాటు విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల్లో కేమియో రోల్స్ చేసింది.

Hello World అంటోన్న మెగాడాటర్ !

‘ఒకమనసు’ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌లో నిహారిక ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో పాటు విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల్లో కేమియో రోల్స్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లో నటించడానికి అంతగా ఉత్సాహం చూపించలేదు. అయితే పలు వెబ్ సిరీస్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి, మేడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీస్టోరీ’ లాంటి వెబ్ సిరీస్‌ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించింది. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నిహారిక నుంచి వస్తున్న మరో సరికొత్త వెబ్ సిరీస్ ‘హలో వరల్డ్’. 


జీ 5 ఓటీటీ సంస్థతో కలిసి నిహారిక నిర్మిస్తున్న ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. అతి త్వరలో స్ట్రీమింగ్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా ప్రకటించింది. ఇందులో కీలకపాత్రలో నటిస్తున్న అనిల్ జీలా పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. యూట్యూబర్‌గా తెలుగువారికి బాగా దగ్గరైన అనిల్ జీలా ఇప్పటికే పలు చిత్రాల్లో నటించాడు. ఎక్కువ శాతం హీరోలకు స్నేహితుడిగా కనిపించాడు. కానీ ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పల్లెలూరి కుర్రాడిగా.. బనియన్, గళ్ళలుంగీ ధరించి,  చేతిలో ల్యాప్ టాప్‌తో రివీలైన అతడి లుక్ ఆసక్తిని రేపుతోంది. ‘అవ్వో.. హైదరాబాద్‌ల సాఫ్ట్‌వేర్ జాబ్ అచ్చిందే’.. అంటూ పోస్టర్‌తోనే సినిమా కథాంశం చెప్పకనే చెప్పారు. 


శివసాయివర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ కామెడీ వెబ్ సిరీస్ లో సదా, ఆర్యన్ రాజేశ్, నిఖిల్, రామ్ నితిన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ నిర్మాణ వ్యావహారాలను నిహారికతో పాటు ఆమె భర్త చైతన్య కూడా చూసుకుంటున్నాడు. కథానుసారంగా ఈ సిరీస్ ను రిచ్ గానే తెరకెక్కిస్తున్నట్టు అర్ధమవుతోంది. పెళ్ళయ్యాకా నిహారిక నిర్మించబోయే తొలి ప్రాజెక్ట్ ఇదే అవడం విశేషం. పల్లెటూరి ప్రజలు కూడా టెక్నికల్ గా ఎంతో అభివృద్ధి చెందుతున్నారని ఈ వెబ్ సిరీస్ తో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. మరి ‘హలో వరల్డ్’ వెబ్ సీరీస్ ఏ స్థాయిలో ప్రేక్షకాదరణను పొందుతుందో చూడాలి.  



Updated Date - 2022-07-12T17:11:27+05:30 IST