లక్ష మంది జీవితాలను మార్చిన విజయ్ సేతుపతి

ABN , First Publish Date - 2022-03-24T21:36:56+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు విజయ్ సేతుపతి. అభిమానులందరూ ముద్దుగా మక్కల్

లక్ష మంది జీవితాలను మార్చిన విజయ్ సేతుపతి

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు విజయ్ సేతుపతి. అభిమానులందరూ ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుస్తుంటారు. ‘విక్రమ్ వేద’, ‘సూపర్ డీలక్స్’, ‘96’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. కాగా.. గత మూడేళ్లుగా ఎంతో మంది జీవితాల్లో ఈ స్టార్ హీరో వెలుగులు నింపాడని ఓ సామాజిక కార్యకర్త తెలిపాడు. అణగారిన వర్గాలవారు ఉద్యోగాలను పొందడంలో సహాయపడ్డాడని అతడు వెల్లడించాడు. వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చాడని పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్లితే..


వీర రాఘవన్ అనే వ్యక్తి పాండిచ్చేరికీ చెందిన సామాజిక కార్యకర్త. అతడు ఓ ఎన్‌జీవోను నడుపుతున్నాడు. వెనకబడిన వర్గాలవారు ఉపాధిని పొందడంలో సహాయపడటమే అతడి పని. వీర చేస్తున్న పనుల గురించి మక్కల్ సెల్వన్‌కు తెలిసింది. ఈ క్రమంలోనే తాను హోస్ట్ చేసిన షోకు అతడిని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆర్థిక సహకారం అందిస్తానని మాటిచ్చాడు. అప్పటి నుంచి వీర స్థాపించిన ఎన్‌జీవోకు స్టార్ హీరో ఆర్థిక మద్దతు అందించడం ప్రారంభించాడు. విజయ్ సేతుపతి క్రమం తప్పకుండా ఆ ఎన్‌జీవోకు డబ్బులు పంపించడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు హీరో ఇచ్చిన సహకారంతో దాదాపుగా లక్ష మందికి ఉపాధిని కల్పించామని వీర రాఘవన్ తెలిపాడు. స్టార్ హీరో చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2022-03-24T21:36:56+05:30 IST