కారు ఇన్సూరెన్స్‌ ఎగ్గోడంటూ స్టార్ హీరో విజయ్‌పై ఆరోపణలు.. అది అబద్ధం అంటున్న అతడి మెనేజర్..

ABN , First Publish Date - 2022-02-22T01:42:54+05:30 IST

తమిళనాడులో ఫిబ్రవరి 19న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి

కారు ఇన్సూరెన్స్‌ ఎగ్గోడంటూ స్టార్ హీరో విజయ్‌పై ఆరోపణలు.. అది అబద్ధం అంటున్న అతడి మెనేజర్..

తమిళనాడులో ఫిబ్రవరి 19న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దలపతి విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అతడు ఎరుపు రంగు మారుతి కారులో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చాడు. ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొంతమంది అభిమానులు ఆర్‌టీఓ వెబ్‌సైట్‌లో చెక్ చేశారు. ఆ సమయంలో అభిమానులు అవాక్కయ్యే ఓ విషయం తెలిసింది. విజయ్ వాడిన కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసిపోయిందనే విషయం వెల్లడైంది. దీంతో స్టార్ హీరోకి వ్యతిరేకంగా అందరు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఆ ఆరోపణలన్నింటికి విజయ్ మేనేజర్ సమాధానమిచ్చాడు. ఆ కారు ఇన్సూరెన్స్ 2022 మే వరకు ఉందని చెప్పాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. అనంతరం నెటిజన్లు ఆరోపణలు చేయడం మానేశారు. 


విజయ్ కార్ ఇన్సురెన్స్ వివాదానికి కారణమైన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమయంలోనే... కోలీవుడ్ స్టార్ హీరో జనానికి ‘సారీ’ కూడా చెప్పాల్సి వచ్చింది. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు విజయ్ వచ్చినప్పుడు ఫొటోలు తీసేందుకు మీడియా పెద్దఎత్తున ప్రయత్నించింది. దీంతో అదే ప్రాంగంణంలో ఓటు వేసేందుకు వచ్చిన సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని గమనించిన విజయ్ అందరికీ క్షమాపణలు చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో తరువాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Updated Date - 2022-02-22T01:42:54+05:30 IST