సినిమా విడుదలకు ముందే కోట్లల్లో లాభం ఆర్జించిన కమల్ హాసన్

ABN , First Publish Date - 2022-03-01T22:15:04+05:30 IST

విభిన్న రకాల పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్

సినిమా విడుదలకు ముందే కోట్లల్లో లాభం ఆర్జించిన కమల్ హాసన్

విభిన్న రకాల పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్. ‘దశావతారం’, ‘విశ్వ రూపం’, ‘విశ్వ రూపం-2’ చిత్రాలతో కోలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘విక్రమ్’. ఈ చిత్రంలో అతడే హీరోగా నటించాడు. సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్’ పతాకంపై నిర్మిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విలక్షణ నటులైన ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘విక్రమ్’ షూటింగ్ గతవారంలోనే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 28న మూవీని విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. 


ఈ మూవీపై ట్రేడ్‌లో మంచి అంచనాలున్నాయి. దీంతో బిజినెస్ జోరుగా కొనసాగుతోంది. సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిలైట్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం డిస్నీ+హాట్ స్టార్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిస్నీ సంస్థ దాదాపుగా రూ.115కోట్లు చెల్లించి హక్కులను కోనుగోలు చేసిందని సమాచారం. ఈ చిత్రాన్ని రూ.110కోట్ల‌ భారీ బడ్జెట్‌‌తో నిర్మించారు అంటే విడుదలకు ముందే దాదాపుగా రూ. 5కోట్లు లాభం వచ్చిందని తెలుస్తోంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారానే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా.. అదనంగా అయిదు కోట్ల లాభాలను పొందిన కమల్‌కు.. థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చేదంతా అదనపు లాభాలే అని చెప్పవచ్చు. ఈ సినిమాలో కమల్‌కు తోడుగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌ కూడా ఉండటంతో ప్రాంతాలకు అతీతంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి, ఫైనల్‌గా ఈ చిత్రం ఎంత మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటుందో.. విడుదలకు ముందే కమల్ ఎన్ని కోట్ల లాభాలను గడిస్తాడో వేచిచూడాలి.

Updated Date - 2022-03-01T22:15:04+05:30 IST