నాగచైతన్య హీరోయిన్‌‌తో రిలేషన్ షిప్‌పై హింటిచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో

ABN , First Publish Date - 2022-03-13T01:53:22+05:30 IST

కోలీవుడ్ హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్, మాంజిమా మోహన్ గత కొంతకాలంగా

నాగచైతన్య హీరోయిన్‌‌తో రిలేషన్ షిప్‌పై హింటిచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో

కోలీవుడ్ హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్, మాంజిమా మోహన్ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనుందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. కానీ, ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు ఎప్పుడూ కూడా అధికారికంగా తెలపలేదు. రిలేషన్‌షిప్‌ను గోప్యంగానే ఉంచుతున్నారు. తాజాగా గౌతమ్ తమ రిలేషన్‌షిప్‌పై ఓ హింట్‌ అయితే ఇచ్చాడు.


మాంజిమా మోహన్ మార్చి 11న బర్త్ డే జరుపుకొంది. గౌతమ్ కార్తిక్ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టాడు. మంజిమాను మోమో అని పిలిచాడు. మాంజిమా లాంటి అద్భుతమైన, శక్తిమంతమైన వ్యక్తి తన జీవితంలో ఉండటం గొప్పగా భావిస్తానని గౌతమ్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే మోమో అని చెప్పాడు. మాంజిమా మోహన్, గౌతమ్ కార్తిక్ ‘దేవరట్టం’ అనే చిత్రంలో జోడీగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరికి పరిచయం అయింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ ఇద్దరూ కలిసి కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిన్నటి తరం హీరో అయిన కార్తీక్ వారసుడే గౌతమ్ కార్తీక్.      


మాంజిమా మోహన్ టాలీవుడ్‌లో నాగచైతన్య సరసన ఓ సినిమాను చేసింది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీకి గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు. మాంజిమా ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Updated Date - 2022-03-13T01:53:22+05:30 IST