కొత్త సినిమాను ప్రకటించిన Pa Ranjith.. ఫస్ట్‌లుక్ విడుదల..

ABN , First Publish Date - 2022-05-22T23:39:24+05:30 IST

కోలీవుడ్‌లో విలక్షణ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith). ‘మద్రాస్’(Madras), ‘కబాలి’(Kabali) , ‘కాలా’ (Kaala) వంటి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు. అతడి నుంచి ఈ మధ్యే

కొత్త సినిమాను ప్రకటించిన Pa Ranjith.. ఫస్ట్‌లుక్ విడుదల..

కోలీవుడ్‌లో విలక్షణ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith). ‘మద్రాస్’(Madras), ‘కబాలి’(Kabali) , ‘కాలా’ (Kaala) వంటి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు. అతడి నుంచి ఈ మధ్యే వచ్చిన చిత్రం ‘సార్‌పట్ట’ (Sarpatta). ఆర్య హీరోగా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ చిత్రం ఇచ్చిన కిక్‌తో ‘నచ్చతిరం నగర్గిరతు’ (Natchathiram Nagargirathu) రొమాంటిక్ ప్రాజెక్టును తెరకెక్కించాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత పా.రంజిత్ తన తర్వాతి చిత్రాన్ని చియాన్ విక్రమ్‌తో చేయనున్నాడు. విక్రమ్ 61వ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. 


ప్రస్తుతం పా. రంజిత్ ప్రతిష్ఠాత్మక ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌’లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘వెట్టువం’(Vettuvam) అనే కొత్త సినిమాను ప్రకటించాడు. ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశాడు. గ్రామీణ నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శత్రువుల నుంచి తప్పించుకోవడానికీ హీరో పోలీసులకు లొంగిపోతాడు. పోలీసులకు లొంగిపోయిన తర్వాత అతడి పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అన్యాయనికీ వ్యతిరేకంగా హీరో ఏ విధంగా పోరాడాడనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ‘వెట్టువం’ షూటింగ్ జులై‌లో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. గోల్డన్ రేషియో ఫిలింస్‌తో కలసి నీలమ్ ప్రొడక్షన్స్ ఈ మూవీని రూపొందిస్తుంది. ‘వెట్టువం’ సినిమా విడుదలయిన తర్వాత ఇదే కథను వెబ్ సిరీస్‌గా కూడా రూపొందిస్తారు. 



Updated Date - 2022-05-22T23:39:24+05:30 IST