మాజీ భార్యకు వ్యతిరేకంగా కేసు వేసిన కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-04-05T02:20:12+05:30 IST

సూర్య హీరోగా తెరకెక్కిన ‘ఎవరికీ తలవంచకు’ చిత్రానికీ సంగీతం అందించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్.

మాజీ భార్యకు వ్యతిరేకంగా కేసు వేసిన కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

సూర్య హీరోగా తెరకెక్కిన ‘ఎవరికీ తలవంచకు’ చిత్రానికీ సంగీతం అందించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్. కంప్యూటర్ ఇంజినీర్ అయిన మోనికా రిచర్డ్‌ను 2008లో పెళ్లి చేసుకున్నాడు ఇమ్మాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ, వీరు విడాకులు తీసుకుంటున్నట్టు గతేడాది డిసెంబర్ 29న ప్రకటించారు. తాజాగా ఇమ్మాన్ తన మాజీ భార్య మోనికాకు వ్యతిరేకంగా కేసు వేశాడు. 


మోనికాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నై హై‌కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన పిల్లలకు ఇప్పటికే పాస్‌పోర్టు ఉందని తెలిపాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి వారి కోసం చట్టవిరుద్ధంగా కొత్తగా పాస్‌పోర్టు ఆప్లై చేసిందని ఆరోపించాడు. ఇమ్మాన్ ఫిర్యాదుపై స్పందించాల్సిందిగా చెన్నై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జోనల్ పాస్ పోర్టు ఆఫీసర్‌కీ ఆదేశాలు ఇచ్చింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పెద్దన్న’, అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమాలకు ఇమ్మానే సంగీతం అందించాడు.


విడాకుల విషయాన్ని తెలుపుతూ ఇమ్మాన్ సోషల్ మీడియా వేదికగా అప్పట్లోనే  ఓ మెసేజ్‌ను తన అభిమానులతో పంచుకున్నాడు. ‘నా శ్రేయస్సును కోరేవారు, నా సంగీతాన్ని ఇష్టపడేవారికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎంతోకాలంగా మీరు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. నేను, మోనిక 2020, నవంబర్‌లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. మేం భార్య, భర్తలుగా ఏ మాత్రం ఉండలేం. మాకు ప్రైవసీ ఇవ్వాలని, జీవితంలో ముందుకు వెళ్లేందుకు సహాయపడాలని మీడియాను కోరుతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు’’ అని ఇమ్మాన్ పేర్కొన్నాడు.

Updated Date - 2022-04-05T02:20:12+05:30 IST