Vijay: లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న స్టార్ హీరో.. ధర వింటే షాకే..

ABN , First Publish Date - 2022-08-28T21:31:37+05:30 IST

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయదలపతి విజయ్ (Vijay). యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. దక్షిణాది ఇండస్ట్రీల్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో అతడు కూడా ఒకరు. తాజాగా విజయ్‌కు సంబంధించిన ఓ

Vijay: లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న స్టార్ హీరో.. ధర వింటే షాకే..

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయదలపతి విజయ్ (Vijay). యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. దక్షిణాది ఇండస్ట్రీల్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో అతడు కూడా ఒకరు. తాజాగా విజయ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతడు భారీ ధర చెల్లించి విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడని సోషల్ మీడియాలో వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.  

  

ఇళయదలపతి విజయ్ చెన్నై సిటీలోని ఖరీదైన ప్రాంతాల్లో ఈ అపార్ట్‌మంట్‌ను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఈ అపార్ట్‌మెంట్ ధర రూ.35కోట్లు అని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ ఈస్ట్ కోస్ట్ రోడ్ ప్రాంతంలో తన కుటుంబంతో కలసి నివాసముంటున్నాడు.  ఆ ప్రాంతం రద్దీగా మారడటంతో కొత్త చోటుకు మారాలని నిర్ణయించుకున్నాడు. అందువల్లే భారీ మొత్తాన్ని చెల్లించి ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ అడయార్‌లోని పాత ఇంటిని ఆఫీసుగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ ఆఫీసుని కూడా కొత్తగా కొనుగోలు చేసిన భవనంలోకి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అడయార్ ఇంటి నుంచి ‘విజయ్ మక్కల్ ఇయ్యకం’ పార్టీ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇళయదలపతి కొనుగోలు చేసిన భవనంలోనే మరో స్టార్ హీరో కూడా ఉంటున్నాడు. ఇప్పటికే ఆర్యకు ఈ భవనంలో సొంతంగా ప్లాట్ ఉంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. విజయ్ ప్రస్తుతం ‘వారిసు’ (Varisu)లో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు.

Updated Date - 2022-08-28T21:31:37+05:30 IST