SSMB29: జక్కన్న, మహేశ్ బాబు సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో..?

ABN , First Publish Date - 2022-10-18T02:01:56+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు యస్‌యస్.రాజమౌళి (SS Rajamouli). ఈ చిత్రంలో జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అనేక రికార్డులను క్రియేట్ చేసింది.

SSMB29: జక్కన్న, మహేశ్ బాబు సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో..?

‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు యస్‌యస్.రాజమౌళి (SS Rajamouli). ఈ చిత్రంలో జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అనేక రికార్డులను క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1200కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 20నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి విదేశీ ప్రేక్షకులు ఈ మూవీపై  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు రాజమౌళిని పొగడటం ప్రారంభించారు. దీంతో రాజమౌళి నుంచి వచ్చే తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముహుర్తం కూడా పెట్టకముందే చిత్రంపై భారీ బజ్ ఏర్పడింది. అయితే, జక్కన్న టాలీవుడ్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu)తో మూవీ చేయనున్నట్టు గతంలోనే చెప్పేశాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి నేపథ్యంలో కథ ఉంటుందని పేర్కొన్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ కోలీవుడ్ హీరో నటించనున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


రాజమౌళి-మహేశ్ బాబు సినిమాలో కోలీవుడ్ హీరో కార్తి (Karthi) కీలక పాత్రలో నటించనున్నాడట. కార్తి కూడా ఆ పాత్రను చేసేందుకు ఆసక్తి చూపించాడని తెలుస్తోంది. చిత్ర బృందం ఇప్పటికి అతడితో టచ్‌లో ఉందని సమాచారం. అయితే, ఈ విషయంపై అటు కార్తి కానీ, చిత్ర బృందం కానీ స్పందించలేదు. అదే విధంగా హీరోయిన్ పాత్ర కోసం దీపికా పదుకొణె (Deepika Padukone) తో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు నటిస్తున్నారో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి స్క్రిఫ్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నాడు. కెఎల్. నారాయణ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహేశ్ బాబుతో తెరకెక్కించే ప్రాజెక్టు తన కెరీర్‌లోనే అతి పెద్దదని కొన్ని రోజుల క్రితమే రాజమౌళి చెప్పాడు.    



Updated Date - 2022-10-18T02:01:56+05:30 IST