Prashanth Rangaswamy: తెలుగు సినిమాలను ప్లాఫ్ చేస్తామంటున్న కోలీవుడ్ సినీ క్రిటిక్..!

ABN , First Publish Date - 2022-10-01T02:04:47+05:30 IST

స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి

Prashanth Rangaswamy: తెలుగు సినిమాలను ప్లాఫ్ చేస్తామంటున్న కోలీవుడ్ సినీ క్రిటిక్..!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.  ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, విక్రమ్ ప్రభు, జయం రవి  తదితరులు కీలక పాత్రలు పోషించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల 'పొన్నియిన్ సెల్వన్‌'ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులను సినిమా అలరించలేకపోయింది. అందువల్ల మూవీని విమర్శిస్తూ తెలుగు వెబ్‌సైట్స్ రివ్యూస్ రాశాయి. ఈ రివ్యూస్‌తో ఓ కోలీవుడ్ సినీ క్రిటిక్ హర్ట్ అయ్యాడు. తెలుగు సినిమాలను ప్లాఫ్ చేస్తామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 


కోలీవుడ్‌కు చెందిన యూట్యూబర్, సినీ క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామి (Prashanth Rangaswamy). ‘పొన్నియిన్ సెల్వన్’ కు వచ్చిన నెగెటివ్ రివ్యూస్‌తో హర్ట్ అయ్యాడు. అందువల్ల ట్విట్టర్‌లో ఘాటుగా పోస్ట్ పెట్టాడు. ‘‘తమిళనాడులో తెలుగు సినిమాలు నడిస్తే మాకు ఎటువంటి సమస్య లేదు. కానీ, తమిళ సినిమాను కావాలని నడవకుండా చేస్తే మీ చిత్రాలకు అదే గతి పట్టిస్తాం’’ అని ప్రశాంత్ రంగస్వామి తెలిపాడు. కానీ, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే ఇతర భాషలకు చెందిన నటులు పలు సందర్భాల్లో తెలుగు చిత్ర పరిశ్రమపై, ప్రేక్షకులపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో రోహిత్ శెట్టి, కార్తి, సూర్య, యశ్ తదితరులంతా టాలీవుడ్ ఇండస్ట్రీని మెచ్చుకున్నారు. ముఖ్యంగా కార్తి నటించిన ‘యుగానికి ఒక్కడు’ తెలుగులో సంచలన విజయం సాధించింది. కోలీవుడ్‌లో ప్లాఫ్ అయింది. తెలుగులో తనకు లభించినంత ప్రేమ కోలీవుడ్‌లో లభించలేదని కార్తి ఓ అవార్డ్స్ ఫంక్షన్స్‌లో స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.



Updated Date - 2022-10-01T02:04:47+05:30 IST