కాల్ చేసిన బాయ్‌ఫ్రెండ్.. ఆత్మహత్య చేసుకున్న మోడల్.. అసలేమైందంటే..

ABN , First Publish Date - 2022-07-18T15:06:50+05:30 IST

కోల్‌కతాలోని పూజా సర్కార్ అనే మోడల్ కోల్‌కతాలోని తన అద్దె ఇంట్లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు..

కాల్ చేసిన బాయ్‌ఫ్రెండ్.. ఆత్మహత్య చేసుకున్న మోడల్.. అసలేమైందంటే..

కోల్‌కతాలోని పూజా సర్కార్ (Puja Sarkar) అనే మోడల్ కోల్‌కతాలోని తన అద్దె ఇంట్లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు నెలలుగా ముగ్గురు మోడల్స్  ఆత్మహత్య చేసుకున్నారు.


పూజా నార్త్ 24 పరగణాస్ జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థి. ఈమె దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో నివసిస్తోంది. శనివారం (జులై 16) సాయంత్రం తన స్నేహితులతో కలిసి పూజా ఓ రెస్టారెంట్‌కి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత, ఆమెకు ఓ కాల్ వచ్చింది. దాని తర్వాత ఆమె ఒక గదిలోకి పరిగెత్తి లోపలి నుంచి తాళం వేసుకుంది. ఆమె స్నేహితురాలు తలుపు తెరవడానికి చాలా ప్రయత్నించింది. కానీ విఫలమవడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజ సర్కార్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే.. చనిపోయే ముందు పూజాకి ఆమె బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందని ఆమె స్నేహితురాలు చెప్పిందని పోలీసులకి తెలిపింది. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.


ఇద్దరు మోడల్స్ ఆత్మహత్య..

కోల్‌కతా మోడల్ (Model) బిదిషా డే మజుందార్ మే 24న డమ్‌డమ్‌లోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకోగా.. పరిశ్రమలోని ఆమె స్నేహితురాలు, మోడల్ మంజుషా నియోగి కూడా మే 27న తన పటులి నివాసంలో ఉరి వేసుకుంది. ఈ మోడల్స్ ఇద్దరూ కూడా రిలేషన్‌షిప్‌తో పాటు సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు, నటి పల్లవి దే సైతం తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరం.

Updated Date - 2022-07-18T15:06:50+05:30 IST