కీర్తి సురేష్, రష్మిక బాటలో కిరాక్ పార్టీ హీరోయిన్

ABN , First Publish Date - 2022-03-16T22:28:17+05:30 IST

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బీస్ట్’.

కీర్తి సురేష్, రష్మిక బాటలో కిరాక్ పార్టీ హీరోయిన్

కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ‘అరబిక్ కుతు’ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యూట్యూట్‌లో ఇప్పటికే ఈ పాటకు 180మిలియన్ల వ్యూస్ లభించాయి. నెటిజన్లు అందరూ ఈ పాటకు ఇన్‌స్టా‌ రీల్స్ చేస్తూ అలరిస్తున్నారు. ‘అరబిక్ కుతు’ పాటకు ఇప్పటికే అనేకమంది సెలబ్రెటీలు డ్యాన్స్ చేశారు. సమంత, కీర్తి సురేష్, రష్మిక మందన్న, ఆష్నా జవేరీ వంటి తారలు స్టెప్పులేశారు. వీరి బాటలోనే నడుస్తూ తాజాగా మరొక హీరోయిన్ ఈ జాబితాలోకి చేరింది. ఆమె ఎవరో కాదు సంయుక్త హెగ్డే. ‘కిరాక్ పార్టీ’ చిత్రంలో నిఖిల్ సరసన నటించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంది.


సంయుక్త హెగ్డే మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘అరబిక్ కుతు’ పాటకు ఆమె కాలు కదిపింది. ఈ సాంగ్‌కు స్టెప్పులేస్తున్న వీడియోను ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘నో మ్యూజిక్, నో ప్రాక్టీస్, కొంచెం మ్యాడ్ నెస్’’ అని వీడియోకు ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ‘అరబిక్ కుతు’ కు అనిరుధ్ సంగీతం అందించాడు. జోనితా గాంధీ ఆలపించింది. స్టార్ హీరో శివకార్తికేయన్.. ఈ పాట లిరిక్స్ రాశాడు. టాలీవుడ్‌లో కిరాక్ పార్టీ అనంతరం సంయుక్త ఏ సినిమా కూడా చేయలేదు. ‘వాచ్‌మ్యాన్’, ‘కోమలి’, ‘పప్పీ’ వంటి కోలీవుడ్ చిత్రాల్లో నటించి, అక్కడి ప్రేక్షకులను అలరించింది. 



Updated Date - 2022-03-16T22:28:17+05:30 IST