Kiran abbavaram: భావోద్వేగ పోస్ట్‌!

ABN , First Publish Date - 2022-07-18T22:35:24+05:30 IST

‘‘రాజావారు రాణిగారు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటున్నారు కిరణ్‌ అబ్బవరం. ప్రస్తుతం ఆయన కోడి రామకృష్ణ కుమార్తె దీప్తి నిర్మిస్తోన్న ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రి సంస్థలో ‘మీటర్‌’, ఏఎంరత్నం సమర్పణలో రూపొందుతున్న ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Kiran abbavaram: భావోద్వేగ పోస్ట్‌!

‘‘రాజావారు రాణిగారు’*Rajavaaru ranivaaru)తో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటున్నారు కిరణ్‌ అబ్బవరం(Kiran abbavaram). ప్రస్తుతం ఆయన కోడి రామకృష్ణ కుమార్తె దీప్తి నిర్మిస్తోన్న ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రి సంస్థలో ‘మీటర్‌’, ఏఎంరత్నం  సమర్పణలో రూపొందుతున్న ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇన్ని సినిమా అవకాశాలు ఎలా వస్తున్నాయి? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి..? గట్టి సపోర్ట్‌ ఉందేమో’ అన్న కామెంట్లు ఆయనపై వస్తున్న నేపథ్యంలో కిరణ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఒక్కో మెట్టు ఎక్కడానికి తన హార్డ్‌వర్క్‌ కారణం అని సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ‘‘క్లాస్‌లో మనకు తక్కువ మార్కులు వచ్చాయనే దానికంటే పక్కవాడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయనే బాధ, నెగెటివిటీ మనలో ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగెటివ్‌ మాటలు ఇప్పుడు నాపై కూడా వస్తున్నాయి. అంటే జీవితంలో నేనేదో పాజిటివ్‌గా సాధించానని నాకు తెలుస్తోంది. కష్టపడి పనిచేయడం వల్లే నాకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. షార్ట్‌ ఫిల్మ్స్‌ నుంచి వరుసగా సినిమాలు చేసే స్థాయికి వచ్చానంటే ఎంతోమంది ప్రేక్షకుల అండ ఉంది. వారందరికీ ధన్యవాదాలు. నా ఎదుగుదలకు మీ సపోర్టే ఫ్యూయల్‌. దానికి థ్యాంక్స్‌ చెబితే సరిపోదు. మరిన్ని చిత్రాలతో ఎంటర్‌టైన్‌ చేేసందుకు ఇంకా కష్టపడి పని చేస్తానని మాటిస్తున్నా. ఈ పని కోసమే ఎన్నో ఏళ్లు తిరిగాను. నాకు నచ్చిన పని నా చెంతకు వచ్చినప్పుడు  దాన్ని ఇష్టపడి చేస్తున్నా’’ అని కిరణ్‌ అబ్బవరం ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. (Kiran abbavaram post viral)


Updated Date - 2022-07-18T22:35:24+05:30 IST