‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్‌ వేడుకకు వచ్చిన కిన్నెర మొగిలయ్య.. పోలీసులు ఏం చేశారంటే?

ABN , First Publish Date - 2022-02-24T01:25:37+05:30 IST

హైదరాబాద్, యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకు ఇటీవల ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన కిన్నెర మొగిలయ్య వచ్చారు. ‘భీమ్లా నాయక్’ చిత్రంలో మొగిలయ్యతో

‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్‌ వేడుకకు వచ్చిన కిన్నెర మొగిలయ్య.. పోలీసులు ఏం చేశారంటే?

హైదరాబాద్, యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకు ఇటీవల ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన కిన్నెర మొగిలయ్య వచ్చారు. ‘భీమ్లా నాయక్’ చిత్రంలో మొగిలయ్యతో సంగీత దర్శకుడు థమన్ ఓ పాట పాడించిన విషయం తెలిసిందే. టైటిల్ సాంగ్‌గా విడుదలైన ఈ పాట సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడమే కాకుండా.. మొగిలయ్యకు ‘పద్మశ్రీ’ వరించడంలో కూడా కీలక పాత్ర వహించింది. ఇప్పుడీ వేడుకకు మొగిలయ్య రావడంతో.. పోలీసులు ఆయనను గౌరవంగా లోపలకి తీసుకెళ్లారు. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో.. పోలీసులు వారిని చెదరగొట్టి, మొగిలయ్యను ప్రీ రిలీజ్ ప్రాంగణంకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.


కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణ రాష్ట్రం తరపున కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ‘పద్మశ్రీ’కి ఎంపికైన విషయం తెలిసిందే. 12మెట్ల కిన్నెర కళలో ఆయన ఆఖరి తరం కళాకారుడు. ‘పద్మశ్రీ’కి ముందే ఆయనలో ఈ కళను గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహించారు. మొగిలయ్య జీవిత చరిత్రను ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. అయితే ఇంత జరిగినా కూడా మొగిలయ్య ఎవరో, ఆయన వాయించే పరికరం, ఆయనకున్న కళ ఏమిటో చాలా మందికి తెలియదంటే అందులో అతిశయోక్తి లేనే లేదు. అలాంటి మొగిలయ్యను ఒక్కసారిగా సెలబ్రిటీని చేసింది మాత్రం ‘భీమ్లా నాయక్’ చిత్రమనే చెప్పుకోవాలి.





Updated Date - 2022-02-24T01:25:37+05:30 IST