అన్నపూర్ణలో పెద్ద పోస్టర్ పెట్టేస్తార‌నిపించింది: King Nagarjuna

ABN , First Publish Date - 2022-07-27T01:11:49+05:30 IST

శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona). జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా భారీగా

అన్నపూర్ణలో పెద్ద పోస్టర్ పెట్టేస్తార‌నిపించింది: King Nagarjuna

శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona). జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది. అనూప్ భండారి (Anup Bhandari) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాక్వలైన్ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez), నిరూప్ భండారి, నీతా అశోక్ ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టించారు. షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ (Jack Manjunath) నిర్మించిన ఈ చిత్రానికి ఇన్‌వెనియో ఆరిజ‌న్స్ బ్యాన‌ర్‌ నిర్మాత అలంకార్ పాండియ‌న్ స‌హ నిర్మాతగా వ్యవ‌హ‌రించారు. మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున (King Nagarjuna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ‘‘కిచ్చా సుదీప్, అనూప్ అందరూ నా పాత సినిమాలను గుర్తు చేశారు. సుదీప్.. కన్నడ అబ్బాయి కాదు తెలుగువాడే. తను హైదరాబాద్‌లోనే ఉంటాడు. సుదీప్ ఇప్పటికే హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మల‌యాళ భాష‌ల్లో న‌టించేశారు. అంద‌రికీ సుదీప్ న‌టుడిగా సుప‌రిచితుడు. ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ అనే ఒకే చిత్రంతో అన్ని భాష‌ల ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు. సాధార‌ణంగా ఇక్కడ ఈ సినిమా తీశారని గ‌ర్వంగా ఫీలై పెద్ద పెద్ద పోస్టర్స్ పెడ‌తాం. ఇంత‌కు ముందు బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ పెట్టాం. విక్రాంత్ రోణ ట్రైల‌ర్‌ రిలీజ్ త‌ర్వాత చూసి అన్నపూర్ణలో పెద్ద పోస్టర్ పెట్టేస్తార‌నిపించింది. ట్రైల‌ర్ అదిరిపోయింది. సినిమాను త్రీడీలో తీశార‌ని అంటున్నారు. క‌చ్చితంగా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. మా తెలుగు ఆడియెన్స్‌ది చాలా మంచి మ‌న‌సు. ఎందుకంటే మా వాళ్లకు సినిమా న‌చ్చిందంటే తీసుకెళ్లి అక్కడ (పైకి చూపెడుతూ) పెడ‌తారు. విక్రాంత్ రోణ సినిమాతో ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను మ‌రోసారి చూడ‌బోతున్నారు. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది’’ అన్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఉత్తరాదిలో స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ స‌మ‌ర్పణ‌లో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేష‌న్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.

Updated Date - 2022-07-27T01:11:49+05:30 IST