King Nagarjuna: ‘సీతా రామం’ చూసి చాలా జలసీ ఫీలయ్యాను

ABN , First Publish Date - 2022-08-12T00:44:39+05:30 IST

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) - మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా.. రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam). వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా

King Nagarjuna: ‘సీతా రామం’ చూసి చాలా జలసీ ఫీలయ్యాను

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) - మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా.. రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam). వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో..  స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (Aswini Dutt) నిర్మించారు. ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ.. క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో ‘సీతా రామం’కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్రయూనిట్ గురువారం థ్యాంక్యూ యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘అశ్వినీదత్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన కంటే నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు స్వప్న, ప్రియాంక. వాళ్ళిద్దరూ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. దత్‌గారికి వారిద్దరూ పెద్ద అండ. ‘మహానటి, జాతిరత్నాలు’.. ఇప్పుడు సీతారామం.. వరుసగా అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. వైజయంతి బ్యానర్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్న స్వప్న, ప్రియాంకకి కృతజ్ఞతలు. వైజయంతి బ్యానర్‌లో నేను 5 సినిమాలు చేశాను. బ్యానర్‌పై ఎన్టీఆర్ (NTR) గారి ఫోటో వుంటుంది. అలాగే నాన్న (ANR)గారు, చిరంజీవి(Chiranjeevi)గారు వైజయంతిలో చిత్రాలు చేశారు. వైజయంతి పేరుని స్వప్న, ప్రియాంక నిలబెడుతున్నారు. సీతారామం చూసి చాలా జలసీ ఫీలయ్యాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్‌కి వెళ్ళింది (నవ్వుతూ). ‘గీతాంజలి, సంతోషం, మన్మధుడు’ రోజులు గుర్తుకు వచ్చాయి. సీతారామం విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రొమాన్స్ మళ్ళీ తెరపైకి వచ్చింది. లవ్, రొమాన్స్ చిత్రాలని ప్రేక్షకులు మళ్ళీ గొప్పగా ఆదరించారు. 


దర్శకుడు హను చాలా వివరంగా, అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. ఇంటర్వెల్ పాయింట్‌లో ప్రేక్షకులని ఎవరూ ఊహించని రీతిలో లాక్ చేశారు. సెకండాఫ్ అత్యద్భుతంగా వుంది. ఇలాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులౌతుంది. మృణాల్ పాత్రలో ప్రేమలో పడిపోయా. అంత అందంగా వుంది. ఎవరైనా ఆ పాత్రతో ప్రేమలో పడాల్సిందే. దుల్కర్ గొప్ప ఛార్మింగ్ వున్న నటుడు. దుల్కర్‌ని చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. అంత గొప్ప ప్రజన్స్ దుల్కర్‌లో వుంది. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గత వారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు. అశ్వినీదత్‌గారు సినిమా థియేటర్‌కి ప్రేక్షకులను తీసుకొచ్చి మా అందరికీ మళ్ళీ నమ్మకం కలిగించారు. సీతారామంను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకులందరికీ మరోసారి కృతజ్ఞతలు’’ అని అన్నారు. 

Updated Date - 2022-08-12T00:44:39+05:30 IST