King Nagarjuna: దానికి మించిన రివ్యూ లేదు.. ఆ మజా లేకుండా చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-10-02T00:50:03+05:30 IST

ఇప్పుడున్న ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే.. కంటెంట్ ఒక్కటే ముఖ్యం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్..

King Nagarjuna: దానికి మించిన రివ్యూ లేదు.. ఆ మజా లేకుండా చేస్తున్నారు

‘‘ఇప్పుడున్న ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే.. కంటెంట్ ఒక్కటే ముఖ్యం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పర్ఫెక్ట్‌గా జరగాలి. కంటెంట్ కింగే కానీ.. సినిమాకి ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ చాలా చాలా ముఖ్యం. ఇవే కాదు, సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగుండాలి. అవి బాగుంటే.. కనీసం ఫస్ట్ డే అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు..’’ అని అన్నారు కింగ్ నాగార్జున (King Nagarjuna). ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను హైరేంజ్‌లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ‘ది ఘోస్ట్’ టీమ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించింది. (Nagarjuna The Ghost Interview)


ఈ కార్యక్రమంలో ‘‘ఇప్పుడు సినిమా చూస్తూ కొందరు.. మినిట్ టు మినిట్ రివ్యూ (Review)లు ఇస్తున్నారు. ఇవన్నీ సినిమాపై ఇంపాక్ట్ చూపిస్తాయని అనుకుంటున్నారా?’’ అని అడిగిన ప్రశ్నకు కింగ్ నాగార్జున సమాధానమిస్తూ.. ‘‘అది ఎవరి రివ్యూ అనేదానిపై ఆధారపడి ఉంటుంది. నాకు నేను.. ఇప్పుడు సినిమా చూడాలని అనుకుంటే.. ఐఎమ్‌డిబి, బుక్‌మైషోలకు వెళ్లి ఫస్ట్ ఉన్న 100 రివ్యూలు చూసి కూడా డిసైడ్ చేసుకోను. 10వేలు, 15వేలు రివ్యూలు వచ్చిన తర్వాత అప్పుడు నమ్ముతాను ఆ రివ్యూస్‌ని. అలాంటి నేను ఒక్కరి రివ్యూని ఎలా నమ్ముతాను? మినిట్ టు మినిట్ అనేది కొత్త విషయమే.. కానీ ట్రైలర్ చూసే హిట్టా, ఫ్లాపా అని డిసైడ్ అయిపోతున్నారు.. ఇక మార్నింగ్ షో తర్వాత మ్యాగ్జిమమ్ సినిమా ఏంటో తేలిపోతుంది. కానీ చాలా సినిమాలు బాగానే ఆడుతున్నాయి. దాదాపు 80 శాతం ప్రేక్షకులు మౌత్ టాక్‌ (Mouth Talk)ను నమ్ముతున్నారు. సినిమా చూసి వచ్చిన తర్వాత.. ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఏం చెబుతారో.. అదే వాళ్లకి రివ్యూ. అదే వర్డ్ ఆఫ్ మౌత్.. దానికి మించిన రివ్యూ లేదు. ఇక మిగతా రివ్యూలు సినిమాకి హెల్ప్ చేయవచ్చు.. చేయలేకపోవచ్చు. ఆ రివ్యూల వల్ల బాగుండే సినిమాలకు ఎటువంటి ఉపయోగం లేదు.. బాగోని సినిమాలకు మాత్రం కాస్త ఉపయోగపడవచ్చు. మంచి సినిమాకి మౌత్ టాక్ అనేది బెస్ట్ రివ్యూ. ఇది నేను చెప్పేది కాదు.. ఆల్రెడీ నిరూపితమైన సత్యమిది. మౌత్ టాక్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. దయచేసి.. 5 నిమిషాల సినిమా కూడా పూర్తికాకముందే బాగోలేదంటూ పోస్ట్‌లు చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే.. రీసెంట్‌గా క్రికెట్ మ్యాచ్ (Cricket Match) చూశాం.. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇంత కొడతాడు.. లాస్ట్ 2 బంతుల్లో గెలుస్తామని ముందే తెలిస్తే.. ఆ మజా పోతుంది కదా!. సినిమాకి కూడా అంతే.. ఆ మజా లేకుండా చేస్తున్నారు..’’ అని రివ్యూలపై నాగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 



Updated Date - 2022-10-02T00:50:03+05:30 IST