Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’ పై నాగార్జున ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2022-08-08T02:37:27+05:30 IST

కొత్త రకం పాత్రలు, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan). మూడు, నాలుగేళ్లకు ఓ సినిమా చేసినా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను

Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’ పై నాగార్జున ప్రశంసల వర్షం

కొత్త రకం పాత్రలు, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan). మూడు, నాలుగేళ్లకు ఓ సినిమా చేసినా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంటాడు. ఆమిర్ తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అమెరికన్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్‌గా రూపొందింది. కరీనా కపూర్ (Kareena Kapoor), నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు. వయాకాం 18 స్టూడియోస్‌తో కలసి తన సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. విడదల తేదీ దగ్గరపడటంతో టాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రీమియర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్‌కు దాదాపుగా 200మంది హాజరయ్యారు. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రీమియర్‌కు కింగ్ నాగార్జన (Nagarjuna) హాజరయ్యి సందడి చేశాడు. ఈ సందర్భంగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మెసేజ్‌లో పోస్ట్ పెట్టాడు.  


‘లాల్ సింగ్ చడ్డా’ ను వీక్షించిన అనంతరం నాగచైతన్యను నటుడిగా ఎదగడం చూస్తుంటే సంతోషమేస్తుందని నాగార్జున తెలిపాడు. ‘‘.. ‘లాల్ సింగ్ చడ్డా’ ను చూసే అవకాశం నాకు లభించింది. ఈ చిత్రాన్ని చాలా విభిన్నంగా తీశారు. ఈ సినిమా భావోద్వేగాలను కదిలిస్తుంది. ఈ మూవీని మీరు చూసిప్పుడు నవ్వుతారు. ఏడుస్తారు. ఆలోచనలో పడుతారు. ప్రేమ, అమాయకత్వంతో అన్నింటిని జయించొచ్చనే సందేశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నాగచైతన్యన నటుడిగా ఎదగడం చూస్తుంటే సంతోషమేస్తుంది. అద్వైత్ చందన్, అతుల్ కులకర్ణితో సహా చిత్ర బృందం అంతా మనల్ని ఉత్తేజపరుస్తుంది’’ అని నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ కు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లేను అందించాడు. బాలీవుడ్‌లో నాగచైతన్యకు ఇదే మొదటి చిత్రం.



Updated Date - 2022-08-08T02:37:27+05:30 IST