Hollywood బ్యూటీ మెడలో మన మహారాజా వారి Necklace... అవమానించటమే అంటోన్న ఇండియన్స్...

ABN , First Publish Date - 2022-05-10T00:36:41+05:30 IST

ఈ మధ్య జరిగిన ‘మెట్ గాలా‘ ఫ్యాషన్ వేడుకలో కిమ్ కర్ధాషియాన్ చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న దుస్తులు ధరించి మెరిసిపోయింది. అయితే, న్యూ యార్క్ అందాల సంబరంలో ఆమె ఒక్కరే కాదు... మరో హాలీవుడ్ బ్యూటీ కూడా చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగలతో ధగధగలాడింది. వాటికి మన ఇండియాతో లింక్ ఉండటమే... అసలు విశేషం!

Hollywood బ్యూటీ మెడలో మన మహారాజా వారి Necklace... అవమానించటమే అంటోన్న ఇండియన్స్...

ఈ మధ్య జరిగిన ‘మెట్ గాలా‘ ఫ్యాషన్ వేడుకలో కిమ్ కర్ధాషియాన్ చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న దుస్తులు ధరించి మెరిసిపోయింది. అయితే, న్యూ యార్క్ అందాల సంబరంలో ఆమె ఒక్కరే కాదు... మరో హాలీవుడ్ బ్యూటీ కూడా చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగలతో ధగధగలాడింది. వాటికి మన ఇండియాతో లింక్ ఉండటమే... అసలు విశేషం! 


Emma Chamberlain మెట్ గాలా వేడుకకి ‘లూయి విటన్’ బ్రాండ్ కాస్ట్యూమ్స్ ధరించి హాజరైంది. అలాగే, ఆమె ఒంటిపై బోలెడన్ని ‘కార్టియర్’ కంపెనీ వజ్రాలు ధగధగలాడాయి. కాకపోతే, మే 2న జరిగిన అందాల సంబరాల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఎమ్మా చాంబర్లియన్ మెడను అంటిపెట్టుకున్న ‘చోకర్’. మన దేశంలోని పాటియాలాకు చెందిన మహారాజా భూపేందర్ సింగ్ దాన్ని 1928లో తయారు చేయించాడు. ప్రపంచంలోనే 7వ అతి పెద్ద వజ్రం ఆయన వద్ద ఉండేది. దాన్ని చోకర్ గా మార్పించాలని పాటియాలా మహారాజు భూపేందర్ సింగ్ నిర్ణయించారు. తరువాత రూపొందిన అద్భుతమే తాజాగా Emma Chamberlain ధరించిన ‘హిస్టారికల్ చోకర్’! 


అప్పట్లో పాటియాలా మహారాజు ‘కార్టియర్’ కంపెనీ వారి చేత తయారు చేయించిన ‘పాటియాలా నెక్లెస్’ మొత్తం 2930 డైమండ్స్ తో, బర్మాకు చెందిన రూబీస్ తో సిద్ధమైంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విలువైన నగల సరసన అది కూడా నిలుస్తుంది! ఇప్పటి లెక్కల్లో ‘పాటియాలా నెక్లెస్’ విలువ 30 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందట! 


ఎమ్మా చాంబర్లియన్ యదపై మెరిసిపోయిన పాటియాలా మహారాజు కంఠాభరణం... చూసేందుకు అద్భుతంగా ఉన్నా... చాలా మందికి ఆనందం మాత్రం కలిగించలేకపోయింది. కారణం... ఆ గాఢమైన నగ వెనకాల అంతే ప్రగాఢమైన విషాదం కూడా ఉండటం! 


మార్లిన్ మన్రో ధరించిన దుస్తులు ‘మెట్ గాలా’ వేడుకలో Kim Kardashian అలంకరించుకోవటం కంటే దారుణమైన విషయం... పాటియాలా మహారాజు నెక్లెస్ తో ఎమ్మా చాంబర్లియన్ జనం ముందుకు రావటం... అంటున్నారు సొషల్ మీడియా యూజర్స్. ‘పాటియాలా నెక్లెస్’ వెనుక ఎంతో లోతైన, బాధాకరమైన చరిత్ర ఉంది అంటూ వారు గతాన్ని గుర్తు చేశారు. 


మరో నెటిజన్ అప్పట్లో ఏం జరిగిందో ప్రస్తావించారు... పాటియాలా సంస్థానం కోశాగారం నుంచీ 1948లో ‘నెక్లెస్’ మాయమైంది. అనుమానాస్పద పరిస్థితుల్లో దొంగిలించబడ్డ భారతీయ నగల్ని అంతర్జాతీయ వేదికలపై ఇప్పుడిలా  ప్రదర్శించటం ఎంత మాత్రం అంగీకరించదగినది కాదు. పాటియాలా మహారాజు ‘కార్టియర్ డైమండ్ చోకర్’ ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్లింది మనకు తెలియదు. కానీ, దాన్ని అమ్మింది, తిరిగి ఖరీదు చేసింది మాత్రం ‘కార్టియర్’ కంపెనీయే. ఇది మాత్రం ఇప్పుడు సుస్పష్టం.... 


ఇంకొక సొషల్ మీడియా యూజర్ తాను సిక్కు మతస్థుడ్ని, పంజాబీని కూడా అయినందు వల్ల ఎంతో బాధపడుతున్నానని కామెంట్ చేశారు. మరోకరైతే ‘కార్టియర్’ డైమండ్స్ కంపెనీని విమర్శిస్తూ పాటియాలా మహారాజు నెక్లెస్ ఏదో ఫ్యాన్సీ జ్యుయలరీ కాదని అన్నారు. సెలబ్రిటీల చేత దాన్ని ధరింపజేసి ప్రదర్శించటం అనేక విధాలుగా అవమానకరం అంటూ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-10T00:36:41+05:30 IST