Vikrant Rona: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘విక్రాంత్ రోణ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-08-25T22:50:38+05:30 IST

కొత్త రకం పాత్రలు, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కిచ్చా సదీప్ (Kichcha Sudeep). యస్‌యస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.

Vikrant Rona: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘విక్రాంత్ రోణ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

కొత్త రకం పాత్రలు, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కిచ్చా సదీప్ (Kichcha Sudeep). యస్‌యస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. సుదీప్ తాజాగా నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona). పాన్ ఇండియాగా తెరకెక్కింది. అనూప్ భండారీ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 28న విడుదలయింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రానుంది. అందుకు సంబంధించిన వివరాలను డిజిటల్ ప్లాట్‌ఫాం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.  


డిజిటల్ ప్లాట్‌ఫాం ‘జీ-5’ లో ‘విక్రాంత్ రోణ’  స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 2 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని ‘జీ-5’ కన్నడ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే, ఈ చిత్రం ఇతర భాషల్లో అందుబాటులో ఉంటుందో, లేదో తెలపలేదు. ‘విక్రాంత్ రోణ’ లో నిరూప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమా రూ.1.25 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా..  ఆ మార్కును మూడు రోజుల్లోనే దాటడం విశేషం. ఈ చిత్రానికి 4 రోజుల్లో వ‌చ్చిన క‌లెక్షన్స్ రూ. 2.92 కోట్లు (షేర్‌)గా తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో జాక్‌పాట్ కొట్టినట్లే. ప్రేక్షకులు థియేటర్లకు రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. కన్నడ హీరో చిత్రం ఈ పాటి కలెక్షన్లు రాబట్టడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి.



Updated Date - 2022-08-25T22:50:38+05:30 IST