‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్: భయమంటే ఏంటో తెలియని ఒకడొచ్చాడు!

ABN , First Publish Date - 2022-06-24T02:50:20+05:30 IST

భారీ బడ్జెట్ చిత్రాల లిస్ట్‌లో విడుదలకు రెడీ అవుతోన్న చిత్రం కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) నటించిన ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona). అనూప్ భండారి (Anup Bhandari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్

‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్: భయమంటే ఏంటో తెలియని ఒకడొచ్చాడు!

Vikrant Rona: భారీ బడ్జెట్ చిత్రాల లిస్ట్‌లో విడుదలకు రెడీ అవుతోన్న చిత్రం కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) నటించిన ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona). అనూప్ భండారి (Anup Bhandari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ నిర్మిస్తుండగా.. ఇన్‌వెనియో ఆరిజ‌న్స్ బ్యాన‌ర్‌ నిర్మాత అలంకార్ పాండియ‌న్ ఈ సినిమాకు స‌హ నిర్మాతగా వ్యవ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. ట్రైలర్ అద్భుతం అంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హిందీ ట్రైల‌ర్‌ను స‌ల్మాన్ ఖాన్‌, త‌మిళ ట్రైల‌ర్‌ను ధ‌నుష్‌, మ‌ల‌యాళ ట్రైల‌ర్‌ను దుల్కర్ స‌ల్మాన్‌, క‌న్నడ ట్రైల‌ర్‌ను కిచ్చా సుదీప్ విడుదల చేశారు. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో.. అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో వచ్చిన ఈ ట్రైల‌ర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ట్రైల‌ర్ చూసిన అనంతరం.. ఈ ‘విక్రాంత్ రోణ’ మూవీ ఒక విజువ‌ల్ ట్రీట్ కాబోతోందనేది తెలిసిపోతుంది. 


వాస్తవానికి ‘విక్రాంత్ రోణ’ సినిమా ప్రకటన రోజు నుంచే భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? ఎలా ఉండ‌బోతుందా? అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో అంద‌రి అంచ‌నాల‌కు మించి త్రీడీ ఫార్మేట్‌లో రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్‌ను మేకర్స్ గురువారం విడుద‌ల చేశారు. ఇందులో ప్రతి సన్నివేశం వండ‌ర్‌ఫుల్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ఆకర్షిస్తోంది. కిచ్చా సుదీప్ ఎంట్రీ నుంచి ఎన్నో సూప‌ర్బ్ స‌న్నివేశాలు ఈ ట్రైలర్‌లో క‌నిపిస్తున్నాయి. ఆశ్చర్యప‌రిచే త్రీడీ విజువ‌ల్స్‌తో ఓ గ్రామం సెట్‌ను కెమెరాలో ఎంతో గొప్పగా ఆవిష్కరించారు. అంద‌రినీ ఆశ్చర్యప‌రిచేలా, అబ్బుర ప‌డేలా భారీ షిప్‌పై కిచ్చా సుదీప్ ఎంట్రీ ఉంది. అలాగే హాట్ లుక్‌లో జాక్వలైన్ అందచందాల‌తో ప్రేక్షకుల మ‌న‌సుల‌ను దోచుకుంది. ట్రైల‌ర్ ఆడియెన్స్‌కి ప‌ర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. కాగా, జూలై 28న ఈ త్రీడీ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Updated Date - 2022-06-24T02:50:20+05:30 IST