Kichcha Sudeep క్షమాపణలు.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2022-07-22T15:39:14+05:30 IST

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ (Kichcha Sudeep) తన స్నేహితులకు, మీడియావారికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణ (Vikrant Rona).

Kichcha Sudeep క్షమాపణలు.. ఎందుకంటే..?

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ (Kichcha Sudeep) తన స్నేహితులకు, మీడియావారికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణ (Vikrant Rona). అనూప్ భండారి (Anup Bhandari) దర్శకత్వం వహించిన ఈ సినిమాను జాక్ మంజు, షాలిని జాక్ మంజునాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కగా.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాక్వలీన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez), నీతా అశోక్, హీరోయిన్స్ గా నటించారు. ధనికుల నుండి ధనాన్ని దోచుకుని పేదలకు పంచిపెట్టే పాత్రలో సుదీప్ కనిపించబోతున్నారు. 


అడ్వెంచరస్ సోషియో ఫాంటసీ సినిమాగా హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన విక్రాంత్ రోణా నుండి ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్ అందరిని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీగా అంచనాలు పెంచాయి. అయితే, ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా 3డి వర్షన్ లో విక్రాంత్ రోణా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి అన్ని భాషల ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సుదీప్. అయితే, హైదరాబాద్ - చెన్నై - కొచ్చిన్ లలో జరుగనున్న మీడియా సమావేశాలకు సుదీప్ హాజరు కావాల్సి ఉంది. 


కానీ అనూహ్యంగా ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన ఈ ప్రాంతాలలో నిర్వహించాల్సిన ప్రమోషనల్ కార్యక్రమాలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో తన అనారోగ్య పరిస్థిని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన సుదీప్ పోస్ట్ పెట్టారు. దీనిలో ఆయన "హైదరాబాద్ - చెన్నై - కొచ్చిన్ ప్రాంతాల్లో మీడియా సమావేశాలు రద్దు కావడం నాకు బాధగా ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా మీడియా మిత్రులకు  క్షమాపణలు. అతి త్వరలో మళ్ళీ మీ ముందుకు వచ్చి ప్రెస్ మీట్స్ లో పాల్గొంటానూ".. రాసుకొచ్చారు.   



Updated Date - 2022-07-22T15:39:14+05:30 IST