‘విక్రాంత్ రోణ’కు మెగాస్టార్స్ సపోర్ట్!

ABN , First Publish Date - 2022-03-31T23:31:28+05:30 IST

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ చాలా గ్రాండ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్ మరియు

‘విక్రాంత్ రోణ’కు మెగాస్టార్స్ సపోర్ట్!

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ చాలా గ్రాండ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్ మరియు కిచ్చా క్రియేషన్స్ సమర్పణలో.. షాలిని ఆర్ట్స్ పతాకంపై జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు. ఇన్‌వెనో ఫిలింస్ అలంకార్ పాండియ‌న్‌ స‌హ నిర్మాత వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర టీజర్‌ని ఏప్రిల్ 2వ తేదీన తెలుగు, మలయాళ మెగాస్టార్స్ విడుదల చేయబోతున్నారు. 


ఏప్రిల్ 2 ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ‘విక్రాంత్ రోణ‌’ తెలుగు టీజర్‌ని మెగాస్టార్ చిరంజీవి, మలయాళ టీజర్‌ని మెగాస్టార్ మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే తమిళ టీజర్‌ని స్టార్ హీరో శింబు విడుదల చేయనున్నట్లుగా సుదీప్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. భారీ బడ్జెట్‌తో పలు భాషలలో నిర్మితమైన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నీతా అశోక్ హీరోయిన్లుగా నటించారు.







Updated Date - 2022-03-31T23:31:28+05:30 IST