Lust Stories: ఈ సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్ రిజెక్ట్ చేసిన పాత్రని కియారా అడ్వాణీ చేసిందట..

ABN , First Publish Date - 2022-08-25T17:09:18+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్స్ నలుగురు కలిసి తీసిని ఆంథాలజీ స్టోరీ ‘లస్ట్‌స్టోరీస్(Lust Stories)’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో..

Lust Stories: ఈ సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్ రిజెక్ట్ చేసిన పాత్రని కియారా అడ్వాణీ చేసిందట..

బాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్స్ నలుగురు కలిసి తీసిని ఆంథాలజీ స్టోరీ ‘లస్ట్‌స్టోరీస్(Lust Stories)’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అందులో ఓ స్టోరీకి కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు. అందులో కియారా అడ్వాణీ (Kiara Advani), విక్కీ కౌశల్ ప్రధానపాత్రల్లో నటించారు. అందులో.. కుటుంబ సభ్యుల ముందు ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతుంది కియారా. ఆ పాత్ర చేసిన తర్వాత కియారాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కియారా పాత్ర గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


హిందీలోని పాపులర్ షోలలో ‘కాఫీ విత్ కరణ్ (Koffee With Karan)’ టాప్ ప్లేస్‌లో వస్తుంది. ఆ సెలబ్రిటీ టాక్‌ షోకి కరణ్ జోహార్(Karan Johar) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి తాజాగా కియారా అడ్వాణీ, షాహిద్ కపూర్ అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ వారిద్దరినీ విచిత్ర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు. అంతేకాకుండా.. లస్ట్ స్టోరీస్ సినిమా గురించి మాట్లాడాడు.


షాహిద్‌తో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ‘నిజానికి కియారా పాత్రని మొదట కృతి సనన్‌(Kriti Sanon)కి ఆఫర్ చేశాను. కథ విని తల్లి ఒప్పుకోదని ఆమె సినిమాని రిజెక్ట్ చేసింది. అప్పుడు అందరి తల్లులు.. వారి కుమార్తెలను ఈ కథ చేయడానికి అనుమతించకుండా ఉంటారనే అనుకున్నాను. వాస్తవానికి ఇది చాలామంచి కథ. మంచి విషయం గురించి చెబుతుంది. ఒక మహిళ ఆనందానికి సంబంధించిన కథ. ఆ తరుణంలోనే నేను కియారాని మనీష్ మల్హోత్రా ఇంట్లో కలిశాను. మరుసటి రోజు నా ఇంటికి వస్తే కథ చెబుతానని చెప్పాను. ఆమె రాగానే కథ చెప్పగా మొదట కొంచెం సందేహపడింది. అనంతరం నేనే డైరెక్ట్ చేస్తున్నానని తెలుసుకుని ఒకే చెప్పింది’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మూవీకి సైన్ చేసేముందు కరణ్ జోహార్ డైరెక్షన్ చేస్తేనే ఇది చేస్తానని కియారా చెప్పిందట. కాగా.. లస్ట్ స్టోరీస్ 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ ఆంథాలజీ ఫిల్మ్‌లో అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన నాలుగు షార్ట్ ఫిల్మ్‌లు ఉన్నాయి.

Updated Date - 2022-08-25T17:09:18+05:30 IST