కోలీవుడ్ హీరోతో Kiara Advani..?

ABN , First Publish Date - 2022-05-31T19:13:33+05:30 IST

బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకున్న కియారా అద్వానీ (Kiara Advani)కి కోలీవుడ్ యంగ్ హీరో సరసన నటించే అవకాశం వచ్చినట్టు లేటెస్ట్ న్యూస్.

కోలీవుడ్ హీరోతో Kiara Advani..?

బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకున్న కియారా అద్వానీ (Kiara Advani)కి కోలీవుడ్ యంగ్ హీరో సరసన నటించే అవకాశం వచ్చినట్టు లేటెస్ట్ న్యూస్. తెలుగులో ‘భరత్ అనే నేను‌’ (Bharath Ane Nenu), ‘వినయ విధేయ రామ‌’ (Vinaya Vidheya Rama) చిత్రాలలో నటించింది కియారా. వీటిలో ‘భరత్ అనే నేను‌’ భారీ సక్సెస్ సాధించగా, ‘వినయ విధేయ రామ‌’ మాత్రం ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో సినిమాలు చేసే తీరిక దొరకనంత బిజీగా హిందీ చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. అక్కడ అన్నీ పెద్ద ప్రాజెక్ట్స్‌లోనే హీరోయిన్‌గా ఎంపికవుతోంది.


‘కబీర్ సింగ్’ తర్వాత కియారాకు హిందీ సినిమాలతోనే క్షణం తీరిక దొరకడం లేదు. ఈ మధ్యలో చాలా తెలుగు చిత్రాలకు కియారా డేట్స్ కావాలని మేకర్స్ సంప్రదించినా వీలుపడలేదు. ఎట్టకేలకు మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - అగ్ర దర్శకుడు శంకర్ (Sankar) కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆర్సీ 15 (RC15)తో సౌత్‌లో కనిపించబోతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మాణ సంస్థకు 50వ చిత్రం, అలాగే హీరో రామ్ చరణ్‌కు కెరీర్‌లో 15వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ గనక భారీ హిట్ సాధిస్తే పాన్ ఇండియా లెవల్‌లో కియారా హిట్ అందుకుంటుంది. 


అయితే, తాజా సమాచారం మేరకు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) సరసన కియారాకు అవకాశం వచ్చిందట. ‘డాక్టర్‌’ (Doctor), ‘డాన్‌’ (Don) వంటి వరుస విజయాలతో దూకుడు మీదున్న హీరో శివకార్తికేయన్‌ మరో రెండు చిత్రాలకు కమిటయ్యారు. ఈయన నటించిన ‘అయలాన్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు టాలీవుడ్‌ దర్శకుడు ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆ తర్వాత విశ్వనటుడు కమల్‌ హాసన్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించే చిత్రంతో పాటు ‘మండేలా’ చిత్ర దర్శకుడు మడోన్‌ అశ్విన్‌ రూపొదించే చిత్రంలో నటించనున్నారు. అయితే, అశ్విన్‌ దర్శకత్వం వహించే చిత్రంలో కియారా అద్వానీ పేరు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు తెలుస్తోది.

Updated Date - 2022-05-31T19:13:33+05:30 IST